పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ ప్రభువు మనకు హింసలూ బాధలూ ఎందుకు రానిసాడో మనకు తెలియదు. కాని అవి మనకు తప్పక మేలుచేసిపెడతాయి కనుక మనం వాటిని ఓర్పుతో అంగీకరించాలి. వాటిని తలపెట్టినవారిని క్షమించాలి.

3. ఈ క్రింది భావనకూడ ఉపయోగపడుతుంది. క్రీస్తు సిలువవైపు చూడండి. అతడు నిర్దోషి. ఐనా అతన్ని అన్యాయంగా సిలువ వేసారు. మనకు అతనికి జరిగిందానికంటె గొప్ప అన్యాయాలు జరిగాయా? అంత గొప్ప అన్యాయాలుజరిగినాకూడ క్రీస్తు సుమ్మర్లు పడలేదు. మనం చిన్నచిన్న అన్యాయాలకే పెద్ద గొడవచేస్తాం. క్రీస్తులాగ కొన్ని సిలువలు అనుభవించకపోతే మనం శిష్యులం అయ్యేదెపుడు? "ధర్మం కోసం హింసలను అనుభవించే వాళ్లు ధన్యులు" అ0టు0ది ఓ అష్టభాగ్యం - మత్త 5,10. మన జీవితంలో మాత్రం ఈ వాక్యం సార్థకం గావద్దా? వేదసాక్షులు, పునీతులు తమ్ము హింసించేవాళ్ళకు వందనాలు చెప్పారు. ఎందుకు? హింసలద్వారా వాళు క్రీస్తు సిలువను మోసే భాగ్యం కలిగింది కనుక,

ఇంకో విషయంగూడ, క్రీస్తు నిర్దోషియైనా శత్రువులు అతన్ని హింసించారు. కాని మనం హింసకు గురైనప్పడు ఈ క్రీస్తులాగ మనంగూడ నిర్దోషులమని చెప్పకోలేం. తరచుగా విరోధులు మనలను హింసించడానికి కారణం మన దుష్టబుద్దే. మన దుష్కార్యాలవల్ల మనం విరోధులను రెచ్చగొడతాం. వాళ్ళ విజృంభించి మనలను పీడిస్తారు. ఈలాంటపుడు మన పాలబడిన హింసలను మనంగాకపోతే ఇంకెవరు అనుభవిస్తారు? పైన పేర్కొన్న భావాలతో మనం శత్రువులను క్షమించడం నేర్చుకోవాలి. శత్రుక్షమాపణం, విశ్వాసం చాల ముఖ్యమైన ప్రార్ధనా విధులు. ఇవిగాక వేరే చిన్న విధులుకూడ వున్నాయి. వాటినిగూడ పరిశీలిద్దాం.

3. ఇహలోక ప్రీతి పనికిరాదు

మన ప్రార్ధనం ఇహలోక వస్తువులను హద్దుమీరి ఆశించేదిగా వుండకూడదు. కేవలం సుఖభోగాలను ఆర్థికలాభాలను కోరేదిగా వుండకూడదు. ఈ సందర్భంతో యాకోబు జాబు ఈలా చెప్పంది. "మీకేమి కావాలో వాటికొరకై దేవుణ్ణి ఆర్థించకపోవడంచేత మీకు కావలసినవాటిని మీరు పొందలేకపోతున్నారు. మీకు దురుద్దేశాలు వుండటం చేతనే మీరర్ధించినవి మీకు లభించడంలేదు. మీ భోగాల కోసమే మీరు వాటిని కోరుతున్నారు. విశ్వాసరహితులారా! ఈ లోకాన్ని ప్రీతితో జూచేవాడు దేవునికి విరోధి అని మీకు