పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పారంటే, మన తరపున మనం అంతా మనమీదనే ఆధారపడిందో అన్నట్లుగా కృషిచేయాలి. ఆ మీదట అంతా దేవునిమీదనే ఆధారపడివుందో అన్నట్లుగా అతన్నినమ్మాలి. దైవబలమూ మన యత్నమూ కలసి విజయాన్ని చేకూర్చి పెడతాయి. మనవిజపంలో మన యత్నమూ వుంది. దేవుని దీవెనా వుంది. కనుక అది బాగా ఫలిస్తుంది. ఫలితాంశమేమిటంటే, మనవి ప్రార్ధనం సులువైంది, అవసరమైంది, ప్రభువే ఆజ్ఞాపించింది.

2. ప్రార్ధనా విధులు

మామూలుగా మనం ప్రార్థనలో ఏమడిగినా ప్రభువు దయచేస్తాడని చెప్పాం. కాని కొన్నిసార్లు అతడు మనమడిగింది ఈయడు, ఇందుకు కారణాలు చాలవుండవచ్చు. ఒక కారణం, మన తరపున మనకు విశ్వాసం లేకపోవడం, ప్రార్ధన ఫలించాలంటే మొదటి విధి పూర్ణవిశ్వాసం.

1. విశ్వాసం

క్రీస్తు అద్భుతాలు చేయకముందు నేనీ కార్యం చేయగలననే విశ్వాసం మీకుందా అని రోగులను అడిగేవాడు. అద్భుతాలు చేయకముందు అతడు పెట్టిన షరతు ఇదొక్కటే. అతడు స్వగ్రామమైన నజరేతూరు వెళ్ళినప్పడు అక్కడ అద్భుతాలు చేయలేకపోయాడు. కారణం ఆ పట్టణ ప్రజలు అతన్ని నమ్మకపోవడమే - మత్త 13, 58.

మన ప్రార్ధనం ఫలించాలంటే విశ్వాసం అత్యవసరమని క్రీస్తు నొక్కిచెప్పాడు. "ప్రార్థనలో మీరు ఏమడిగినా దాన్ని తప్పక పొందుతామని విశ్వసించండి. అప్పుడు మీరడిగింది లభిస్తుంది"- మార్కు 11.24. ఈ వాక్యాన్ని బట్టి, విశ్వాసముంటే చాలు మన ప్రార్ధనం ఫలిస్తుందని రూఢిగా నమ్మవచ్చు.

యాకోబు జాబుకూడ ఈ సత్యాన్నే బోధిస్తుంది. "మీలో ఎవరికైన వివేకం లేకపోతే అతడు దేవుణ్ణి అడగాలి. ఆయన దాన్ని ప్రసాదిస్తాడు. దేవుడు ఎవరిని గద్దింపక అందరికి ఉదారంగా అనుగ్రహిస్తాడు, కాని నరుడు విశ్వాసంతో అడగాలి, ఏ మాత్రం అనుమానించరాదు. అనుమానించేవాడు గాలికి అటూ యిటూ కొట్మకొనే సముద్రతరంగం లాంటివాడు. ఈలాంటివానికి ప్రభువునుండి ఏమీ లభించదు, వాడు ద్విమనస్కుడు, చపలచిత్తుడు. వాడికి ఏ పనిలోను స్థిరత్వముండదు-యాకో1, 5-8. ఈ వాక్యాలనుబట్టీ విశ్వాసంలేకుండాచేసే ప్రార్ధన గాలికి అటూయిటూ కొట్టుకొనే అలలాంటిది. అవిశ్వాసి మనసులో నమ్మకమూ అపనమ్మకమూ రెండూ వుంటాయి. కనుక అతని వేడుదల ఫలించదు.