పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంచివాళ్ళంటే ఆ పట్టణాలను కాపాడమని దేవుణ్ణి అడిగాడు. తర్వాత ఈ సంఖ్యకు 45కి, 40కి, 80కి, 20కి, 10కి తగ్గించుకొంటూ వచ్చాడు. దేవుడు ఆ నగరాల్లో 10 మంది భక్తిమంతులున్నా వాటిని కాపాడతానన్నాడు. ఇక్కడకూడ దేవుడు అబ్రాహాము ప్రార్ధనంవల్ల తన మనసు మార్చుకొన్నాడు గదా? - ఆది 18, 17-82

ఆమోసు ప్రవచనంలో ఈ వదంతాలు కన్పిస్తాయి. ప్రభువు యిప్రాయేలును శిక్షించడానికి వారి దేశంమీదికి మిడుతల దండును పంపబోతున్నాడు. కాని ఆమోసు ప్రవక్త ఆ ప్రజల తరపున దేవునికి మనవి చేసాడు. ప్రభువు తన మనసు మార్చుకొని ఆ కీడును చేయడం మానివేసాడు. మళ్ళా దేవుడు రెండవసారి వారిని శిక్షించడానికి అగ్నిని పంపబోతున్నాడు. ప్రవక్త రెండవసారి కూడ దేవునికి మనవి చేసాడు. ప్రభువు మనసు మార్చుకొని ఆ యగ్నిని తొలగించాడు -7, 1-6.

ఈ వుదాహరణలన్ని ఏమి బోధిస్తున్నాయి? బైబులు మనుష్య భాషలో మాట్లాడుతుంది. దేవుడు తన మనసు మార్చుకోడు. ప్రార్ధనవల్ల మన మనసే మారుతుంది. అతడు నరుల ప్రార్ధనంవల్ల తాను అనుకొన్న కీడు చేయక మేలే చేస్తాడు. కనుకనే యాకోబు జాబు - ఈలా చెప్తుంది. "నీతిమంతుని ప్రార్ధనం మహా శక్తితో పనిచేస్తుంది. ఏలియా మనలాంటి వాడే. అతడు భక్తితో ప్రార్థన చేయగా మూడేండ్ల వానలు ఆగిపోయాయి. అతడు మరల ప్రార్థించగా వానలు కురిసాయి - యాకో 5, 16-18, కనుక దేవుడు భక్తిగల నరుల ప్రార్థనకు లొంగుతాడు అనుకోవచ్చు.

7. మనవి ప్రార్ధనం అవసరం ఏమిటి?

కొందరు మనవి ప్రార్ధనం స్వార్థంతో కూడిందనీ, అది వట్టినాసిరకం జపం అనీ చెప్తారు. ఇది పొరపాటు. స్వార్థమున్నా ఇది చాల గొప్ప ప్రార్ధన. అధిక సంఖ్యాకులు చేసికొనే ప్రార్ధన యిదే. మామూలుగా మన ప్రార్థనాజీవితం ఈ జపంతోనే ప్రారంభమౌతుంది. సువిశేషాల్లో క్రీస్తకూడ ఈ ప్రార్థననే చాలసార్లు శిష్యులకు నేర్పించాడు. అసలు బైబులు అంతటిలోను ఎక్కువగా కన్పించే ప్రార్ధన యిదే. కనుక మనం ఈ జపాన్ని అవశ్యం వినియోగించుకోవాలి.

ఇంకా కొందరు అసలు మనం మనవి ప్రార్ధనం ఎందుకు చేయాలని అడుగుతారు. ఆకాశ పక్షుల్ని పోషించేవాడు, పొలంలోని పిచ్చిమొక్కల్ని రంగురంగుల పూలతో అలంకరించేవాడు మనలను పట్టించుకోడా అంటారు. మన అవసరాలు అతనికి తెలుసు కదా, మళ్ళా మనం ప్రార్థనలో అడుగుకోవడం దేనికి అంటారు. నిజమే. దేవుడు పక్షులనూ మొక్కలనూ పోషించేవాడే మన అవసరాలు తెలిసినవాడే. దీన్నిబట్టి మనం