పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్ధిస్తున్నాం. మనం ఈలా మనవి చేయకపోతే దైవరాజ్యం రాదా? అది భూమిమీద వ్యాపించదా? వ్యాపిస్తుంది. ఐనా ఇక్కడ తండ్రి మనచే దైవరాజ్య వ్యాప్తికొరకు ప్రార్థన చేయిస్తున్నాడు. కనుక మనం ఆవశ్యం మనవి జపం చేయాలి.

మన తరపున మనం తప్పకుండా మనవి జపం చేయాలని తెలియజేయడానికి క్రీస్తు ఓ వుపమానం చెప్పాడు, ఒకడు రాత్రివేళ తన స్నేహితుని వద్దకు వచ్చి మూడు రొట్టెలు బదులీయమని అడిగాడు. ఆ మిత్రుడు రాత్రిలో లేచి రొట్టెలీయడానికి బద్దకించాడు. కాని ఆ వచ్చినవాడు పదేపదే ప్రాధేయపడి అడిగినందున చివరకు లేచి మూడు రొట్టెలిచ్చాడు. ఈలాగే మనంకూడ దేవుణ్ణి మల్లా మళ్లా అడిగితే అతడు మనం కోరినవి తప్పకుండా యిస్తాడు. అడిగిన ప్రతివానికి దయచేస్తాడు - లూకా 11, 5–10.

పై వేదవాక్యాలు దేవుడు అడిగిన ప్రతివాడికి యిస్తాడని చెప్తున్నాయి – 11, 10. అనగా ప్రార్థన చేసేవాడు నేను పాపాత్ముజ్ఞా పుణ్యాత్మజ్జా అని శంకించనక్కరలేదు. మన తరపున మనం భక్తితో మనవి చేస్తే దేవుడు మన మనవి ఆలించి తీరుతాడు. సందేహించనక్కరలేదు. కనుకనే ప్రభువు ఇక్కడ ఇంకో వుపమానం కూడ ఎత్తుకున్నాడు. తండ్రి తన బిడ్డడు ఆకలిగొని తినడానికి చేపనడిగితే పామునీయడు. గ్రుడునడిగితే తేలునీయడు. భూలోకంలోని తండ్రులే తమ బిడ్డలు అడిగినప్పుడు ఈలా మేలివస్తువుల నిస్తూంటే, పరలోకంలోని తండ్రి మనం వేడినప్పడు ఇంకా యెంతో అధికంగా మంచి వస్తువుల నీయడా? తప్పక యిస్తాడు - లూకా —11, 11-13.

కనుక క్రీస్తు ఉద్దేశం ప్రకారం మనం ప్రార్ధనం చేయాలి. ప్రార్థనలో మన మడిగినవన్నీ దేవుడు దయచేస్తాడు. మన జపం ప్రధానంగా మనవి రూపంలో ఉంటుంది.

ఈ మనవి ప్రార్థనలో వుండే శక్తి అంతాయింతా కాదు. అందుకే నూత్నవేదం చాల తావుల్లో ఈ రకం ప్రార్థనను గూర్చి చెప్తుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. ప్రార్ధనలో మీరు దేన్ని అడిగినా దాన్ని తప్పక పొందుతామని విశ్వసించండి - మార్కు 11, 24. రేయింబవళ్ల తనకు మొరపెట్టుకొనే ప్రజలకు దేవుడు న్యాయం చేకూర్చకుండా వుంటాడా? - లూకా 187. మీరు నా పేరిట ఏమి యడిగినా నేను దాన్ని చేసిపెడతాను - యోహా 14,14. మీరు నా పేరిట తండ్రిని ఏమి యడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడు - 16, 23. నీతిమంతుని ప్రార్థన మహా శక్తిమంతమైనది. ఏలీయా వానలు కురవవద్దని ప్రార్థిస్తే కురవలేదు. కురవాలని ప్రార్ధిస్తే కురిసాయి - యాకో 1, 16-18, క్రీస్తు చిత్తానుసారంగా మనం ఏదైన కోరితే ఆయన తప్పక వింటాడు -1 యోహా 5,14. ప్రతి విషయంలోను ప్రార్థనలతో, కృతజ్ఞతా పూర్వకమైన విజ్ఞాపనలతో మీ విన్నపాలను దేవునికి