పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుండనేవుంది. ప్రాచీన క్రెస్తవ గేయ కారుడెవరో “తేదేయం” అనే అద్భుతమైన ఆరాధన గీతికను రచించాడు. వీటిలో వేనినైన వాడుకోవచ్చు. ఈ ప్రార్ధనం చేసికోవచ్చు.

44. మీ దేహం పరిశుద్దాత్మకు ఆలయం - 1కా 6,19

ఆరాధనకు ఉపకరించే మరోసాధనం మన హృదయం. మనలో చాలామంది బహిర్ముఖులు. వాళ్ళను వీళ్ళను, వాటిని వీటిని చూస్తూ కాలక్షేపం చేస్తుంటాం. కాని మహాభకులు అతర్ముకులు. ఆ మహానుభావులు వాళ్ల హృదయంలోనికి తొంగిచూచుకున్నారు. హృదయ పీరంమీదనే భగవంతుడ్డి నెలకొల్పుకున్నారు. ఆలా హృదయాంతరాళంలో నెలకొనివున్న భగవంతుణ్ణి ఆ హృదయంలోనే ఆరాధించుకున్నారు.

జ్ఞానస్నానంతోనే మన దేహం దైవవ్యక్తులకు ఆలయమౌతుంది. ప్రభువు మన హృదయంలో వసిస్తాడు. కనుక క్రైస్తవ భక్తుడు హృదయమనే దేవాలయంలోగూడ భగవంతుని ఆరాధిసూండాలి,

45. అతనిద్వారా, ఆత్మయందు, తండ్రిని చేరుతాం -ఎఫే 2, 18.

మీదటి యంశాల్లో ముగ్గురు దైవవ్యక్తులను గూర్చి ప్రస్తావిస్తూ వచ్చాం. ఇక మన ప్రార్థనలను ఈ ముగ్గురిలో ఎవరికి సమర్పించాలి? దివ్యారాధనలోగాని, బైబుల్లోగాని కనుపించే సామాన్యక్రమం ఇది. మన ప్రార్థనలను పితకు అర్పిస్తూండాలి. క్రీస్తు శిష్యులకు ప్రార్ధనం నేర్పుతూ పితనుద్దేశించి ప్రార్థించమన్నాడు. మరోమారుకూడ శిష్యులతో మాటలాడుతూ, మీకు వలసినవాటిని నా పేరుమీదుగా తండ్రిని అడుగండి అన్నాడేగాని, నేరుగా నన్నే అడగండి అనలేదు - యోహా 16, 23. కనుక మనం అడుగుకోవలసింది తండ్రిని.

ఇక, యీ ప్రార్ధనం క్రీస్తుద్వారా చేస్తూండాలి. ఎందుకనగా ఆ ప్రభువు ఆర్ధించిన పాపపరిహారం వలన మనం పితకు ప్రియపడుతూన్నాం. క్రీస్తు లేందే పిత మనకు తండ్రికాడు, మనం పితకు పత్రులమూగాము.

ఈలా పితకు సమర్పించే ప్రార్ధనం, క్రీసుద్వారా చేసే ప్రార్ధనం, పరిశుద్దాత్మయందు చేస్తూవుండాలి. ఈ యాత్మమే మనచేత దేవుణ్ణి "తండ్రి" యని పిలిపిస్తుంది - రోమా 8,15. ఈ యాత్మ మనయందు ప్రార్ధిస్తూ వుంటుంది, మనమూ తనతోపాటు ప్రార్థన చేసేలా చేస్తుంది - రోమ 8, 26-27. కనుక మనం పితకు ప్రార్ధనం చేయాలి. నూత్న వేదంలో నేరుగా క్రీస్తునకు చేసిన ప్రార్థనలున్నాయి. మనమూ నేరుగా క్రీస్తునకు ప్రార్థన చేయవచ్చు. కాని యిక్కడ మనం సూచించిన క్రమం ప్రాచీనకాలం నుండి బహుళ ప్రచారంలోవున్న సామాన్య నియమం, అంతే.