పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ బాధనే పౌలు "ముల్ల" అని పేర్కొన్నాడు
ఈ కంటకాన్ని తొలగించమని
అతడు ముమ్మారు నిన్ను వేడాడు
నీవు ఆ శల్యాన్ని తీసివేయలేదు గాని
"నీవు దుర్భలుడవై యున్నపుడు నా శక్తి నీమిూద పనిచేస్తుంది
నా యనుగ్రహం నీకు చాలుపో అని మాత్రం సెలవిచ్చావు
పౌలు ఆ పీడను తొలగించమని మళ్ళా అడగనే లేదు
తాను దౌర్బల్యంతో క్రుంగిపోయినపుడే గాని
నీ బలాన్ని పొందలేనని విశ్వసించాడతడు
కావననే "నేను బలహీనుడనై యున్నపుడే
బలవంతుజ్ఞవుతాను" అని వాకొన్నాడు
ఈ వాక్యంలో ఎంతో సత్యం వుంది
నీవు వినయవంతులను దుమ్ములోనుండి పైకి లేవనెత్తేవాడివి
గర్వాత్ములను ఆసనాలవిూది నుండి క్రిందికి పడద్రోసేవాడివి
మా బలాన్ని చూచి కాదుగాని మా దుర్బలత్వాన్ని చూచి
నీవు మమ్మాదరిస్తావు
లోకంలో నరులైతే గొప్పలు చెప్పకొంటారు
తమ ప్రజ్ఞాప్రాభవాలను ఏకరువు పెడతారు
కాని మేమైతే నీముందు మా యశక్తతను ప్రదర్శించుకొంటాం
మా చేతగానితనాన్ని వెల్లడిచేసికొంటాం
అప్పడు నీ శక్తి మామిూదికి బలంగా దిగివస్తుంది
మహావృక్షానికి అల్లకొన్న బలహీనపు తీగ
ఆ తరువ బలంలో తానూ పాలుపొందినట్లే
బలాఢ్యుడవైన నినాశ్రయించిన మేంకూడ
బలాన్ని పంచుకొని బలశాలుల మౌతాం.

61. మనలను నమ్మే ప్రభువు

యోహొ 21,13-17

ప్రభూ! నీవు నరస్తీరాన శిష్యులకు దర్శనమిచ్చినపుడు
"ఓయి! వీళ్ళకంటె అదనంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా?"
అని పేత్రుని ముమ్మారు ప్రశ్నించావు, అతడు ముమ్మారు
ఔను ప్రభూ! వీళ్ళకంటె అధికంగానే ప్రేమిస్తున్నానన్నాడు
నీవు "ఐతే నా గొర్రెలను మేపు" అని శిష్యులందరిమిూదా,