పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాళ్ళముందు నిలువలేక దాసోహమన్నారు
నీవు ఈనాడు అల్పులమైన మమ్ముకూడ నీ పరిచర్యకు పిల్చావు
కాని అసమర్థులమైన మేము నీకు ఏమి సేవలు చేయగలం?
మావల్ల నీ పనులు నెరవేరి నీ రాజ్యం వ్యాప్తి జెందుతుందా?
నేటి నవనాగరికతా ప్రపంచానికి
నిన్ను చాటిచెప్పే స్తోమత మాకుందా?
అసలు మేమెంత మా బండారమెంత?
ఈలా మేము ఓవైపు అధైర్యం చెందినా
మరోవైపు ఆ శిష్యుల యెన్నికను చూచి
ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొంటాం
ఎప్పడుగూడ నీవు అజ్ఞానుల నెన్నుకొని
విజ్ఞులనబడేవాళ్ళకు జ్ఞానం లేదని నిరూపిస్తావు
దుర్బలుల నెన్నుకొని బలవంతులకు బలం చాలదని నిరూపిస్తావు
అల్పుల నెన్నుకొని అధికుల మహత్తును చిత్తు చేస్తావు
ప్రభూ! నీవీలా తాడూబొంగరమూ లేనివాళ్ళను
నీ సేవకులుగా గ్రహించడం దేనికి?
ఏ నరుడూ నీముందు గొప్పలు చెప్పకోకుండా వుండేందుకా?
నే నంతటివాణ్ణి యింతటివాణ్ణి అని
ప్రగ్గెలు పల్కకుండా వుండేందుకా?
మాలో పనిచేసే శక్తి దైవబలం కాని మానుషబలం కాదని
మాచే ఒప్పించేందుకా?
మా బలమూ విజ్ఞానమూ పాపపరిహారమూ పావిత్ర్యమూ అంతా
సిలువవిూద మృతిపొంది మళ్ళా ఉత్థానుడవైన నీనుండేనని
మే మెల్లరమూ వినయంతో అంగీకరించేలా చేసేందుకా?
అలాగైతే మేము నీ శిష్యుల మైనందుకు
అధైర్యం చెందంగదా యింకా వుబ్బిపోతాం
కాని మా వుబ్బూ మా లావూ మానుండిమాత్రం కాదు
మేము నీ శక్తిని పొందిన దాసులమనుకొని పొంగిపోతాం - అంతే.

60. దుర్బలులకు బలం

2కొరి 12,7-10.

ప్రభూ! నీవు భక్తుడైన పౌలుకి ఎన్నోసార్లు సాక్షాత్కరించావు
కాని ఆ దర్శనాలవల్ల పౌలు కెక్కడ తల తిరుగుతుందోనని
అతన్ని యేదో దుర్బలమైన బాధతో పీడించావు