పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీ సందేశాలనే వుప్పుద్వారా
లోకాన్ని భ్రష్టత్వం నుండి కాపాడాలి
దీప స్తంభంమిూది దీపం ఇంటిని వెలుతురుతో నింపుతుంది
అలాగే మేమూ ప్రపంచాన్ని నీ బోధలనే కాంతితో నింపాలి
పూర్వవేదంలో ధర్మశాస్త్రంలాగే
నూత్నవేదంలో నీ బోధలుకూడ వెలుగు
ఆ వెలుగుతోనే మేము లోకంలోని చీకట్లను పారద్రోలాలి
కొండమిూద కట్టిన నగరం పదిమంది కంటా పడుతుంది
అలాగే నీ శిష్యులమైన మమ్మ
ఇరుగుపొరుగువాళ్ళు గమనిస్తుంటారు
కనుక మా జీవితం శుద్ధంగాను భక్తిమంతంగాను వండాలి
చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా వుండకూడదు
మేము మంచి కార్యాలు చేస్తే తోడిజనులు సంతోషిస్తారు
ఈలాంటి పుణ్యపురుషులను పుట్టించావని దేవుణ్ణి స్తుతిస్తారు
కాని మేము దుష్కార్యాలుచేస్తే జనులు మనసునొచ్చుకుంటారు
ఈ కుక్కమూతి పిందెల నేందుకు పుట్టించావని
దేవునికి మొరపెడతారు
కనుక మేము వళ్ళ దగ్గర బెట్టుకొని యోగ్యంగా మెలగాలి
ఎంతచెట్టు కంతగాలి అంటారు
నీ శిష్యులమైనందుకు మాకు గొప్పబాధ్యతలు సంక్రమించాయి
అసలు మా జీవితం పవిత్రంగా లేందే
లోకం మా బోధలను నమ్మదు
గులాబీ తన సుగంధాన్ని గూర్చీ
అందాన్ని గూర్చీ వుపన్యాసాలీయదు
ఐనా స్త్రీలు ముచ్చటపడి
దాన్ని జడల్లో ముడుచుకొంటారు
అలాగే నీ శిష్యులమైన మేము నీ బోధలను పాటిస్తూ
ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితం జీవిస్తే
లోకం మమ్ము నమ్ముతుంది, మెచ్చుకొంటుంది
ఆచరణశుద్ధి కలవాడు ఆర్భాటంతో ఉపన్యాసాలీయనక్కరలేదు
గులాబీలా మౌనంగా వున్నా
లోకం తనంతట తాను దాని చెంతకు వస్తుంది
కనుక మేము నోటిద్వారా బోధించే వేదసత్యాలను
మా నడవడికద్వారా ఆచరించి చూపించే భాగ్యాన్ని ప్రసాదించు