పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈలాంటి తగవులన్నీ పరిష్కరించడానికీ
పేత్రు ఏడురు పరిచారకులను నియమించవలసి వచ్చింది
మా జీవితంలోమ ఈలాంటి గొడవలే వస్తూంటాయి
మేము చిన్నదానికీ పెద్దదానికీ ఇరుగుపొరుగువారితో కలహిస్తాం
కొంచెం సర్దుకుపోతే జగడాలు వాటంతటవే సమసిపోతాయి
కాని తగాదాలు కొనితెచ్చుకొనే బుద్ధిమాది
అసలు ఏవో కొన్నికయ్యాలు లేకపోతే మాకు నిద్రపట్టదు
నోటిమాటల్లో వస్తువుల వాడకంలో,
ఇచ్చిపుచ్చుకోవడంలో, ఆసనాలు ఆక్రమించుకోవడంలో,
వస్తువులు పంచుకోవడంలో, పనులు చేయడంలో -
ఎక్కడికి వెళ్ళనా ఏమిచేసినా అన్నీ తగాదాలే
మేము ఎంత అల్పబుద్దులమో
అంత సులభంగా కయ్యానికి కాలు దువ్వుతాం
నీచులు కలహాన్నీ సాధువులు సంధినీ
అభిలషిస్తారనే సూక్తి వుండనేవుంది
ప్రభూ! మేము తోడివారిపట్ల ప్రేమతో మెలిగేలా చేయి
తీసికోవడం కంటె ఈయడం ధన్యమని గుర్తించేలా చేయి
ఎప్పుడూ మాదే పైచేయిగా వుండాలనే
దురభిమానానికి లోనుగాకుండా వుండేలా చేయి
తోడివారితో భేదాభిప్రాయాలు వచ్చినపుడు
మాది కొంత వదలుకొనైనాసరే
కయ్యాలకు దూరంగా వుండే సద్బుద్ధిని దయచేయి.

55. క్షమాధర్మం

ఆది 50,15-21. లూకా 23,34

ప్రభూ! సోదరులు యోసేపని బానిసగా అమ్మారు
అతడు దైవబలం వలన ఐగుప్తుకి మంత్రియయ్యాడు
తర్వాత సోదరులు రెండుసార్లు ధాన్యంకోసం ఐగుప్తు వెళ్లారు
రెండవతూరి యోసేపు వాళ్ళకు తన్నెరుకపరచుకొన్నాడు
దానితో వాళ్లు తాము చేసిన యుపకారాన్ని జ్ఞప్తికితెచ్చుకొని
యోసేపు తమవిూద పగదీర్చుకొంటాదేమోనని హడలిపోయారు
కాని ఆ యుదారహృదయుడు వాళ్ళకు అభయమిచ్చి
“ఆనాడు విూరు నాక నిక్కంగా కీడు తలపెట్టారు