పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వం రాహేలు గొడ్రాలుగా వుండిపోగా
ఆమెయక్క లేయాకు ముత్యాల్లాంటి పిల్లలు పట్టారు
ఇకనేం ఆ చెల్లెలు అక్కనుజూచి కండ్లల్లో నిప్పలు పోసికొంది

యాకోబు తన ముద్దులకొడుకు యోసేపుకి
పొడుగుచేతుల నిలువుటంగీని కుట్టించడం జూచి
అతనియన్నలు తండ్రిమిద కవిసిపడ్డారు

సాలు రణరంగంలో ఫిలిస్ట్రీయులను వేయిమందిని చంపాడుకాని
దావీదైతే పదివేలమందిని చంపాడని స్త్రీలు పాడాగా విని
సౌలురాజు దావీదుమీద కుతకుత వడికిపోయాడు

ఎవడో అనామక శిష్యుడొకడు క్రీస్తు పేరుమిూదిగా
దయ్యాలను వెళ్ళగొడుతుంటే పండ్రెండుమంది శిష్యులూ
చుప్పనాతితనంతో అతనికి అడ్డంబోయారు -
ఈలా వుంటాయి పతనమానవుల దుర్గుణాలు
మేమెంత అల్పబుద్దులమో అంత సులభంగా అసూయచెందుతాం
లోపల పరుగుపడి గుమ్మడిపండును కుళ్ళబెడుతుంది అ
లాగే అసూయకూడ మా హృదయాలను తొలిచి
మేము లోలోపల కుళ్ళిపోయేలా చేస్తుంది
ఇతరుల వృద్ధినిచూచి ఓర్వలేనితనంతో ప్రుగ్గిపోయేవాడికి
ఇక వేరే శత్రువులంటూ అక్కరలేదుకదా?
ప్రభూ! ఈ దురుణాన్ని మాయంతట మేము అణచుకోలేం
మా పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసిన క్రీస్తు సిల్వమరణమే
ఈ రాక్షసగుణాన్ని మా హృదయాల్లోనుండి తుడిచివేయాలి.

54. జగడాలు

అచ 6,1-6.

ప్రభూ! యెరూషలేములోని ఆదిమ క్రైస్తవ సమాజంలో
పాలస్తీలా యూదులనీ అన్యదేశాల యూదులనీ
రెండు తెగలవాళ్ళు ఉండేవాళ్లు
ఆ యుభయ వర్గాలవాళ్లు పొత్తుకుదరక కీచులాడుకొన్నారు
అన్యదేశాల యూదులు తమ వితంతువులకు కూడు అందలేదని
పాలస్తీనా యూదులతో జగడమాడారు
అప్పుడు అన్నం అందరికీ సకాలంలో ముట్టేలా చూడ్డానికీ