పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41. సింహాసనాసీనుడైన దేవునికి నమస్కారం చేసాడు - దర్శ, 19,4

భగవంతుని ఆరాధించి మహిమ పరచడమే నరుని ఆశయం అన్నాం. సృష్టి ప్రాణులు మోక్షంలో చేసే పనికూడ నిత్యం భగవంతుణ్ణి ఆరాధిస్తూండడమే. దేవదూతలు పనీతులు కలకాలం మోక్షంలో ఆ ప్రభువుని ఆరాధించి స్తుతిస్తూంటారు. నూత్నవేదంలోని చివరి పుస్తకమైన దర్శన గ్రంథాన్ని(దర్శనాగమం) వ్రాసిన యోహాను మోక్షంలోని భక్తులు ప్రభువును ఆరాధించే తీరును ఓ దర్శనంలో చూచాడు. నాలు జీపులూ, ఇరువది నల్లురు పెద్దలు, సాగిలపడి సింహాసనాసీనుడైన దేవునకు నమస్కారం చేసారు. స్తుతి, రక్షణం, మహిమ, ప్రభావం మా దేవునికే చెల్లుతాయి అంటూ ఆ ప్రభువుని వందించారు. ఇది మోక్షారాధనం. ఈలాంటి ఆరాధననే భక్తులు భూమిమీదకూడ అర్పిస్తుంటారు. కనుక ఈ యారాధన ప్రార్థనకు మనంకూడ చిన్ననాటి నుండే తర్ఫీదు పొందుతూండాలి.

42. యేసు నామమునకు ప్రతివాడు మోకాలు వంచాలి - ఫిలి 2,10

తండ్రి, సుతుడు ఆత్మ అని దేవునిలో ముగ్గురు వ్యక్తులు. సుతుడుగూడ దైవవ్యక్తి గనుక తండ్రికి సరిసమానుడు. ఐనా అతడు నేను తండ్రితో సమానమైన వాడ్డిగదా అని బెట్టుగా వుండిపోలేదు. మరి మనుష్యుని రూపం ధరించి దాసుడై పుట్టాడు. తన్నుతాను ఖాళీచేసుకున్నాడు, అనగా తన దైవత్వాన్ని వదలివేసుకున్నాడు. పైగా అతడు సిలువ మరణం చెందడానికి గూడ వెనుకాడలేదు. ఈలా సుతుడు తన్నుతాను తగ్గించుకొని తండ్రికి విధేయుడయ్యాడు, మనుష్యరక్షణం సాధించాడు. అందుచేత తండ్రి అతన్ని మెచ్చుకొని "ప్రభువు" అనే తన బిరుదాన్ని కుమారునికి గూడ అనుగ్రహించాడు. అతన్ని హెచ్చించి మహిమపరచాడు. ఇక మీదట పరలోకంలోని దేవదూతలుగాని, పాతాళంలోని పిశాచాలుగాని, భూమిమీది మనుష్య ప్రాణులుగాని ఈ ప్రభువుని ఆరాధించాలి. భక్తి వినయ మర్యాదలతో ఇతని నామానికి మోకాలు వంచాలి. ప్రతిజీవి జిహ్వకూడ యేసుక్రీస్తు ప్రభువని స్తుతించాలి. ఈ యారాధనం క్రీస్తునకు, క్రీస్తుద్వారా తండ్రికి మహిమను కలిగిస్తుంది.

43. రండి, నమస్కారంచేసి సాగిలపడదాం - కీర్తన 95,7.

“యావేమన దేవుడు. మనం ఆయన పాలించే ప్రజలం, ఆయన గొట్టెలం. రండీ, ఆయన ఎదుట నమస్కారంచేసి, సాగిలపడదాం? అన్నాడు కీర్తనకారుడు. చాల భక్తిపూరితమైన మాటలివి, ఈలాగే "పితకును సుతునకును" అనే త్రీత్వస్తోత్ర జపంగూడ ఆరాధనకు ఉపకరిస్తుంది. పూజలో వచ్చే "ఉన్నతమునందు" అనే మహిమగీతమూ ఆరాధన ప్రార్ధనమే, ఇక యెషయా దేవాలయ దర్శనంలో వినిన "పరిశుద్దులు" అనే స్తుతి ప్రార్ధనం