పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక వాళ్ళ చెడ్డపనులనో అంటే
గోరంతలు కొండంతలు చేస్తాం
మా హృదయంలో ఇతరులమిద
అసలు సదభిప్రాయమే వుండదు
కనుకనే వాళ్ళంటే కొరకొరలాడతాం,
కటువుగా మాటలాడతాం, క్రూరంగా విమర్శిస్తాం
ఎవరూ అడగకపోయినా యితరులను గూర్చిన
మా అభిప్రాయాలను బాహాటంగా వెలిబుచ్చుతాం
అసలు తోడినరుల విూద మమ్మెవ్వరు
న్యాయాధిపతులనుగా నియమించారో మాకే తెలీదు
ఇతరులు మమ్ము విమర్శిస్తే మాత్రం అగ్గిలా మండిపోతాం
మా హృదయంలోని ఉద్దేశాలు వాళ్ళకేలా తెలుసు అంటాం
విషయాన్ని అర్థంజేసికొని మంచిచెడ్డలు విచారించి
సానుభూతిలో మాట్లాడాలికదా అని వాపోతాం
మూ విమర్శల్లో మాత్రం ఈ సూత్రాలను ఏమాత్రం పాటించం
మేమసలు ఇతరులకు తీర్పు తీర్చగూడదు
ఒకవేళ తీర్పు తీర్పవలసివస్తే సానుభూతీ మానవతా
ఉట్టిపడేలా మాట్లాడే భాగ్యాన్ని
ప్రభూ! నీవుగాకపోతే మరెవరు మాకు ప్రసాదిస్తారు?

51. నాలుక

యాకో 3,2-12. సామె 8,21. కీర్త 14,3.

ప్రభో! నాలుక ఎంత దుష్టావయవం
దానివలన రోజూ ఎన్నిపాపాలు మూటగట్టుకొంటాం
చిన్నకల్లెం గుర్రాన్ని అదుపులో పెట్టుకొంటుంది
చిన్న చుక్మాని పెద్ద నావను అటూఇటూ త్రిప్పతుంది
అలాగే ఈ చిన్న నాలుక
మా దేహాన్నంతటిని వశంచేసుకొంటుంది
అది మాచేత పలుకగూడని పాడుపలుకులు పలికిస్తుంది
అది అంత చిన్న అవయవమైనా యెంతగా డప్పాలు కొడుతుంది!
చిన్న నిప్పరవ్వ మహారణ్యాన్నే దహిస్తుంది
అల్పావయమైన నాలుక మా జీవితాన్నే తగులబెడుతుంది
అసలు దయ్యమేవచ్చి మొదట దానికి చిచ్చుపెట్టగా