పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చీకట్ల విచ్చిన వెలుగుబాటలో పయనిస్తున్నారుగాన
ఆ సుకృతాత్మలు ఏనాడూ కాలుజారి పడిపోరు
తండ్రీ! నీవు మొదట మమ్మ ప్రేమించావు కనుకనే
ఇప్పడు మేము నిన్ను ప్రేమించగల్లుతూన్నాం
మేము నిత్యం నీ ప్రేమలో నెలకొనివుండి నీ వెలుగుబాటలో
నిబ్బరంగా పయనించే భాగ్యం దయచేయి
విశేషంగా తోడినరుణ్ణి అనాదరంజేస్తూగూడ
దేవుణ్ణి పూజిస్తున్నాంగదా అది చాలులే
అనుకొనే ఆత్మవంచనం నుండి మమ్మ విమోచించు
కంటికి కనుపించే తోడినరుణ్ణి ప్రేమించలేనివాడు
కంటికి కనుపించని భగవంతుణ్ణి ప్రేమిస్తాడా?
అందుబాటులో వున్న నరుణ్ణా
లేక యెక్కడో దూరంగా వున్న దేవుణ్ణా
ఎవరిని ప్రేమించడం సులభం?
ఓవైపు తోడిమానవుణ్ణి చిన్నచూపు చూస్తూనే
నిన్ను పూజింపబూనడం అబద్దాలకోరుల లక్షణం
కనుక తండ్రీ! నిన్ను ప్రేమించినపుడు తోడినరులనూ
వారిని ప్రేమించినపుడు నిన్నూ ప్రేమిస్తామనే సత్యం
మేము ఏనాడూ విస్మరించకుండా వుండేలా చేయి.

50. పరవిమర్శ

లూకా 6.37-38

ప్రభూ! నీవు తోడివారిని గూర్చి చెడ్డగా భావించవద్దన్నావు
"మిూరు ఇతరులను చెడ్డవారని యెంచకండి
అప్పడు దేవుడు కూడ విూరు చెడ్డవారని యెంచడు
ఇతరులవిూద నేరం మోపకండి
భగవంతుడుగూడ మామిూద నేరం మోపడు
ఇతరులను క్షమించండి దేవుడూ మిమ్ము క్షమిస్తాడు
విూరు తోడిజనుల కేలాంటి కొలత కొలుస్తారో
దేవుడు విూకూ అలాంటి కొలతే కొలుస్తాడు"
అని నీవు పర్వత ప్రసంగంలో విశదం చేసావు
కాని మా దౌర్భాగ్యమేమిటంటే
.s୪ofତ పొరుగువాళ్ళను సులభంగా అడిపోసుకొంటాం
వాళ్లు చేసిన మంచిపనులు మాకట్టే నచ్చవు