పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"క్రీస్తు మొదట శ్రమలనుభవించిగాని
ఆ పిమ్మట మహిమను పొందడు"
ఎన్నేండ్లు జీవించినా ఏమేమి సాధించినా
నీ శిష్యులమైన మాకు కూడ
ಇదే శాశ్వత సూత్రం.

40. మన తల్లి

యోహా 19,26-27

క్రీసూ! నీ వానాడు కొండకొమ్మున వ్రేలాడుతూ
సిల్వచెంత నిల్చియున్న నీ తల్లి మరియను
శిష్యుడు యోహానుకి తల్లిగా ఒప్పగించావు
ఆ శిష్యుడు మా కందరికీ ప్రతినిధిగా వుంటాడు కనుక
ఆ పునీతమాత మా కందరికీ తల్లి అయింది
ప్రభూ! నీవు మాకు చాల వరాలను దయచేసావు
కాని మి యమ్మనే మాయమ్మగా బడయడం
నీవు ప్రసాదించిన వరాలన్నిటిలోను ఉత్తమమైంది
నీకు అత్యంత ప్రీతిపాత్రురాలైన మాతృమూర్తి
మాకూగూడ గారాబుతల్లి కావడం సామాన్యభాగ్యమా?
నేడు నీ శిష్యుల్లో కొందరు ఆ తల్లిని అంగీకరించరు
నీ తల్లిని గౌరవిస్తే నిన్నగౌరవించినట్లే నంటారు
నీ వొక్కడివే మధ్యవర్తివని వాదిస్తారు
వాళ్ళ చాదస్తంగాని
తల్లిని మెచ్చుకొంటే మెచ్చుకోని తనయుడుంటాడా?
మేము తన్నుకొనియాడినప్పడు
మరియమాత్రం ఏం చేస్తుంది?
ఆ తల్లి మమ్మ ఆదరంతో నీ చెంతకే చేరుస్తుందికాని
తన చెంతకు రాబట్టుకొని సంతోషించదు కదా?
మమ్ము నీకడకు చేర్చే తల్లి మాన్యురాలెందుకు కాదు?
ఇంటిలో తల్లిలేని పిల్లలకు దిక్కూమొక్కూ వుండదు
మరియ అనే తల్లి లేని పిల్లలకు అలాంటి దుర్గతే పడుతుంది
ప్రభూ! లోకంలోని అందరు కుమారుల్లాగే
నీవూ నీ తల్లిని గౌరవించావు, ప్రేమించావు,
ఇతరులూ ఆమెను గౌరవించాలని కోరుకొన్నావు