పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34. క్రీస్తుతో ఐక్యత

యోహా 15,1-6, 1కొ 12,27, 1 పేత్రు 2,4-5.

ప్రభూ! జ్ఞానస్నానం ద్వారా మేమంతా నీతో
ఐక్యమౌతామని చెప్పడానికి
నీ భక్తులైన దివ్యగ్రంథ రచయితలు
మూడుపమూనాలు పాడారు
యోహాను చెటూకొమ్మలు అనే సాదృశ్యం చెప్పాడు
కొమ్మలు చెట్టుకు అతుక్కొని వుంటాయి
చెట్టు సారం కొమ్మలలోనికి ప్రసరింపగా
అవి పూలుపూచి కాయలు కాస్తాయి
అలాగే మేముకూడ నీతో ఐక్యమౌతాం
అప్పడు నీసారమనే వరప్రసాదం మాలోనికి ప్రసరిస్తుంది
ఫలితంగా మేము యోగ్యమైన దివ్యజీవితం గడుపుతాం
చెట్టనుండి నరికివేసిన కొమ్మలు
నిలువన యెండిపోతాయి
అలాగే నీనుండి వేరయినప్పడు
మేముకూడ నిప్రయోజకులమై పోతాం.

పౌలు దేహం అవయవాలు అనే దృష్టాంతం చెప్పాడు
చాలా అవయవాలు దేహానికి అతుక్కుని వుంటాయి
ఆ యంగాలన్నిటికీ నాయకత్వం వహించేదీ
వాటిని చైతన్యవంతం చేసేదీ శిరస్సే
అవయవాలూ శిరస్సూ అన్నీ కలసి ఒక్క శరీరమౌతాయి
అలాగే మేముకూడ అవయవాల్లాగ
నీలోనికి అతుక్కొని పోతాం
నీవూ మేమూ కలసి ఒక్క ఆధ్యాత్మిక శరీరమౌతాం
ఈ దేహానికి మేము అంగాలమైతే నీవు శిరస్సువి
మమ్మ నడిపించే నాయకుడివి
నీవే మాకు జీవశక్తి నొసగేదీ నీవే.

పేత్రు పునాదిరాయిూ దానిమిదిరాళ్ళు అనే పోలిక చెప్పాడు
పునాదిరాతితో మందిరం ప్రారంభమౌతుంది
దానివిూద ఇతర శిలలను పేర్చుకొంటూ పోతారు
మూలరాయూ దానిమిూద పేర్చిన యితరశిలలూ కలసి.