పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీసభను ఓ భవనంలా నిర్మించి
వృద్ధిలోకి తీసుకరావడానికి
మాకు ప్రవచనం ఆరోగ్యదానం మొదలైన
సేవావరాలు అనుగ్రహిస్తావు
ఈలా నీవు నిరంతరం మాకు వెలలేని వుపకారాలు చేస్తూ
ఆధ్యాత్మిక జీవితంలో మమ్ము ముందుకు నడిపిస్తూంటావు
ఐనా మేము నిన్నట్టే పట్టించుకోం, నీ దివ్యనామాన్ని స్మరించం
నిన్ను గూర్చి మాకు సరిగా తెలియను గూడ తెలియదు
పూర్వం పౌలు ఎఫెసు పట్టణంలోని శిష్యులను
విూరు పవిత్రాత్మను పొందారా అని ప్రశ్నింపగా వాళ్ళ
పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతే మాకు తెలియదే అన్నారు
నేడు మాపరిస్థితికూడ యిలాగేవుందనడానికి సిగ్గుపడుతున్నాం
మేము కనీసం పునీతులపట్ల చూపే భక్తినైనా
దైవవ్యక్తివైన నీపట్ల చూపం
మాకు బైబులు గ్రంథంతో పరిచయం లేదు కనుక
రక్షణ చరిత్రో నీ స్థానమేమిటో అర్థం చేసికోలేం
క్రీస్తు తర్వాత నీవు మాకు రెండవ ఆదరణకర్తవనీ,
నీవు లేందే అసలు ఆధ్యాత్మిక జీవితమే లేదనీ గ్రహించలేం
మా యజ్ఞానాన్ని మన్నించి మాకు నీపట్ల భక్తిని పుట్టించు
పసిబిడ్డ తల్లి చెంతకులాగా మా యాధ్యాత్మికావసరాల్లో
మేము నమ్మకంతో నీ చెంతకు పరుగెత్తుకొని వచ్చేలా చేయి
మేము పాపకార్యాలకు పాల్పడి
మా అంతరంగాల్లో నెలకొనివుండే
పవిత్రమూర్తివైన నిన్ను దుఃఖపెట్టకుండా వుండేలా చేయి
నీ ప్రబోధాలను పెడిచెవిని బెట్టి
మా హృదయసదనంలో వెలిగే దివ్యజ్యోతివైన నిన్ను
అవివేకంతో ఆర్చివేసికోకుండా వుండేలా చేయి
నీవు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినం
పారాయణం జేసికొని
మమ్ముగూర్చిన దైవచిత్తాన్ని గుర్తించి
పవిత్ర జీవితం గడపేలా చేయి.