పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారికి త్రోవ జూపుతూంటావు
ఓవైపు పిశాచం బిడ్డలను పిశాచం నడిపిస్తూంటే
మరోవైపు దేవుని బిడ్డలను దేవుని ఆత్మవైన నీవు నడిపిస్తుంటావు
నీ ప్రబోధాలను గుర్తించి మేము పాపమార్గంనుండి వైదొలగి
క్రీస్తు ఆదేశించిన పుణ్యపుత్రోవల్లో నడవాలి
మేము ఆరాధన ప్రార్థన సేవాది పుణ్యకార్యాల్లో మునిగి వున్నపుడు
నీవు మా అంతరంగంలో మెల్లని స్వరంతో మాటలాడుతూ
మాకు రకరకాల ప్రబోధాలు కలిగిస్తుంటావు
మేము అంతర్ముఖులమై నీవు చేసే యీ హెచ్చరికలను గమనించేలా చేయి
నీవు మా హృదయాల్లో పుట్టించే
మంచి కోర్మెలద్వారానే మమ్మ నడిపిస్తావు
మేమా కోర్కెలను క్రియలుగా మార్చుకొనే భాగ్యాన్ని ప్రసాదించు
విశేషంగా మేము బైబులు గ్రంథాన్ని చదివి ప్రార్ధనచేసికొనేపుడు
ఆ వేదవాక్యాలద్వారా మా కర్తవ్యాన్ని మాకు తెలియజేయి
మా దైనందిన బాధ్యతలను మేము సంతృప్తికరంగా నిర్వర్తించేలా చేయి
ప్రియాప్రియ సంఘటనల్లోను దేవుని హస్తాన్ని గుర్తించేలాచేయి
మూ ముఖ్యకార్యాలన్నిటిలోను నిన్ను సంప్రతించేలా చేయి
ఒకోసారి నీవు ఇతరుల పలుకులద్వారా మాతో మాటలాడినపుడు
వినయంతో మేమా మాటల భావాన్ని గ్రహించేలా చేయి
మేము మా నాయకుడివైన నీవెంట పయనించి తండ్రియింటిని జేరి
క్రీస్తు దివ్యముఖాన్ని దర్శించే మహాభాగ్యాన్ని దయచేయి.

30. పవిత్రాత్ముడు ఉన్నాడనికూడ తెలియకపోతే

యెష 11,1-2 గల 5,22, 1కొ 12,4-11. అచ 19.1-7,

ఎఫె 4,30. 1తెస్స 5,19.

పావనాత్మమా! క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన మమ్ము
పవిత్రపరచడానికి నీవు మాకు సప్తవరాలు దయచేస్తావు
ప్రేమ సంతోషాది తొమ్మిది ఫలాలనుగూడ ప్రసాదిస్తావు
ఇంకా మేము క్రైస్తవ సమాజానికి సేవలు చేసి