పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీవు మా హృదయాల్లోనే వుండి మాకొరకు మనవిచేస్తుంటావు
నాడు క్రీస్తు శిష్యులకు ప్రార్ధనం నేర్చినట్లుగా
నేడు నీవూ మాకు జపం చేసికొనే విధానం నేర్పించు
మేము మాటలతో స్పష్టంగా చెప్పలేకపోయినా
మా భక్తిభావాలూ హృదయాలోచనలూ తండ్రికి తెలిసేలా చేయి
మేము ప్రార్ధన అనే నిచ్చెనద్వారా
తండ్రివద్ద కెక్కిపోయేలానూ
ఆ నిచ్చెన ద్వారానే తండ్రి
మా వద్దకు దిగివచ్చేలానూ అనుగ్రహించు
మాకు ప్రార్థనమిూద గాఢమైన కోర్కెపట్టించు
మా జపానికొక రూపం దయచేసి దాన్నివో తోటలా పెంచు
శతాబ్దాల పొడుగునా పునీతులకు ప్రార్ధనం నేర్చింది నీవు
భక్తులచే దైవార్చన చేయించింది నీవు
సాధకులకు తాత్వికచింతనంమిూద ప్రీతి పట్టించింది నీవు
నేడు మమ్మకూడ ప్రార్థనాతత్పరులనుగా తీర్చిదిద్దు
ప్రొద్దుతిరుగుడు పూవు సూర్యునివైపు తిరిగినట్లుగా
మా హృదయాలుకూడ భగవంతునివైపు తిరిగేలా చేయి
మేము ఇరుగుపొరుగువారిని గూర్చిన సుదులతో కాలక్షేపం చేయక
దేవుని సన్నిధిలో పవిత్రంగా కాలం గడిపేలా చేయి
విశేషంగా అనుదినం దివ్యగ్రంథాన్ని పారాయణం జేసికొంటూ
ప్రభువు సందేశాలను భక్తితో మననం జేసికొనేలా చేయి
నిరంతర వేదవాక్యచింతనం వలన
అమృతసిద్ధిని పొందేలా దయచేయి.

29. భక్తులను నడిపించే ఆత్మ

అచ 13,1-4. రోమా 8,14

ఆత్మమా! శ్రీసభ ప్రారంభకాలంలో
రెండు క్రైస్తవకేంద్రా లుండేవి
యెరూషలేము కేంద్రానికి పేత్రు యాకోబులు అధిపతులు