పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ ఒక్కటిగా బంధించినట్లుగా
నానా వర్గాలతో కూడిన క్రైస్తవ ప్రజానీకాన్ని
దివ్యాత్ముడవ్తెన నీవు ఒక్క ప్రేమసమాజంగా బంధిస్తావు
ఇది మానవమాత్రుల కృషివల్ల సిద్దించే కార్యంగాదు
పాపపు మానవులు ఒకరినుండి వొకరు విడిపోతుంటే
పావనాత్మడవైన నీవు ఒకరితో ఒకరిని ఐక్యపరుస్తావు
నీదివ్యప్రభావానికి మేము నీకు సదా కైమోడ్పులర్పిస్తాం.

28. ప్రార్థన నేర్చే ఆత్మ

రోమా 8,26-27, హెబ్రే 7,25. లూకా 11,1

పావనాత్మమా! మేము లోకవ్యామోహాల్లో
చిక్కుకొని ప్రార్థన చేయలేం
మా హృదయాలను ఈ మంటివిూదినుండి
మింటివిూదికి త్రిప్పకోలేం
మా యీ బలహీనతను జూచి నీవు తల్లిలా జాలి జెందుతావు
నీ బిడ్డలమైన మాకు సహాయం చేయడానికి పూనుకొంటావు
ఎప్పుడు, ఎక్కడ, ఏలా ప్రార్ధనచేయాలో మాకు తెలియకపోతే
నీవు మా తరపున ప్రార్థన చేస్తావు,
మాచే గూడ జపం చేయిస్తావు
తల్లి తాను నడుస్తూ పసిబిడ్డచే అడుగులు వేయిస్తూ
ఆ శిశువుకు నడవడం నేర్పించునట్లుగా వుంటుంది నీ పరిశ్రమ
నీవు మా హృదయాల్లో వుండి ప్రార్థన చేస్తూండగా
నరుల హృదయాలోచనలు తెలిసిన తండ్రి
ఆ ప్రార్థనను గ్రహిస్తాడు
మేము దేవుని చిత్తప్రకారం నడచుకోవాలని నీవుచేసే ప్రార్ధన
తండ్రికెంతో ప్రీతి కలిగిస్తుంది,
అతడా వేడికోలు నంగీకరిస్తాడు
క్రీస్తు మోక్షంలో తండ్రి సమక్షంలో
మా తరపున ప్రార్థన చేస్తుంటే