పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ దివ్యయజమానునికి ఊడిగం చేసేలా చేయి
మేము ఒకసారి విడనాడిన పిశాచ నాయకునికి
పాపకార్యాలద్వారా మరల దాస్యంచేయకుండావుండేలా చేయి
ఇంకా మేము జ్ఞానస్నానం పొందినప్పటినుండి
నీవు మా హృదయంలో ఓ దేవాలయంలోలాగ వసిస్తూంటావు
దేవుడెక్కడ వసిస్తే అదే దేవాలయం
కావున నీ సాన్నిధ్యంవలన మేము పవిత్ర మందిరానిమాతాం
పూర్వం యెరూషలేము దేవాలయంలో భక్తులు
నిష్కళంకమైన గొర్రెపిల్లలను బలిగా అర్పించేవాళ్లు
అలాగే నీవు మమ్ముకూడ
పవిత్ర నైవేద్యంగా దేవుని కర్పిస్తావు
మాకు నిర్మలజీవితంమిూద ప్రీతి పుట్టించు
పవిత్రుడైన దేవుణ్ణి కొలిచే మేముకూడ ఆ ప్రభువులాగే
పవిత్రులంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించు
కుమ్మరిపురుగు బురదలో తిరుగుతున్నా బురద దానికి సోకదు
తామరాకు నీటిలో మునిగి తేలుతున్నా నీరు దాని కంటదు
అలాగే మేము ఈ పాపపులోకంలో సంచరిస్తున్నా
లోకవాసన లంటకుండా జీవించేలా అనుగ్రహించు

ఇంకా జ్ఞానస్నానం పొందినప్పడే
నీవు దేవుని ప్రేమను మా హృదయాలమిూద కుమ్మరిస్తావు
బొక్కెనతో మొక్కలకు పాదునిండ నీళ్లు పోసినట్లుగా
నీవు మా యెడదలకు సమృద్ధిగా ప్రేమజలాన్ని పోస్తావు
దీనివల్లనే మేము దేవుడ్డీ తోడినరుజ్జీ
కొలదిగానైనా ప్రేమిస్తున్నాం
స్వార్థపరులమైన మేము ఇతరులను ప్రేమించడాని కొప్పుకోం
అన్యులది తీసుకోగోరుతాంగాని వాళ్ళకీయడానికి ఇష్టపడం
కాని నీవు దయచేసే ప్రేమశక్తివల్ల మా బదులు మారతాయి
మేము తోడివారిని అన్నదమ్ముల్లాగ, అక్కచెల్లెళ్లలాగ ఆదరిస్తాం
దేహంలోని అవయవాల నన్నిటినీ