పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ పేదనరుణ్ణి పట్టించుకొంటావుకూడ
ఇంకా ఆశ్చర్యమేమిటంటే
నీవు నరుడ్డి దేవుడంతటివాడ్డిగా చేసావు
కీర్తికిరీటంతో అతన్ని అలంకరించావు
నీ సృష్టికంతటికీ అతన్ని అధిపతిని చేసావు
నీవు కలిగించినవాటి నన్నిటిని
అతని పాదాలక్రింద వుంచావు" - అన్నాడు
తండ్రీ! ఈలాంటి నరజన్మను నీవు నాకు ప్రసాదించావు
నూరేండ్ల క్రితం నేను లేను
మరో నూరేండ్ల తర్వాత ఉండబోను
పూర్వం ఈ మంటివిూద నేను లేను
ఉండవలసిన అవసరంకూడ లేదు
మరి నేడు నేనుంటున్నానంటే వింతలలోకెల్ల వింతకాదా?
పుట్టగలిగిన వాళ్ళనందరినీ నీవు పట్టింపవు
కొందరికి మాత్రమే పట్టవనిస్తావు, వాళ్ళల్లో నేనూ వొకట్టి
పైగా నేను ఓ రాయిగానో చెట్టుగానో మృగంగానో
ఓ గంటకాలం నీ కృపవల్ల మనివుంటే అదీ గొప్పే
కాని నీవు నాకు అంతకంటె ఉత్కృష్ణ జన్మనే యిచ్చావు
నన్ను నీకు పోలికగా చేసావు, నీయాత్మను నాలో వుంచావు
నేను శాశ్వతంగా మనగలను
నీవు వసించే దివ్యధామం చేరుకోగలను
అసలు నేనంటే నీకిష్టం, నీవు నన్ను చీదరించుకోవు
నేనంటే నీ కసహ్యమైతే నీవు నన్నెందుకు పుట్టిస్తావు?
నీవు పట్టించందే ఏప్రాణి పడుతుంది?
నీవు సంరక్షించందే ఏప్రాణి మనుతుంది?
నాశంలేని నీ యాత్మే నాలోనూ నెలకొని వుంది
కనుక తండ్రీ! నా పుట్టవును స్మరించుకొని
విన్మయంతో వేమారు నీ ముందట ప్రణతుడనయ్యేలా చేయి
ఈలాంటి జన్మను దయచేసిన గారాబు తండ్రివైన నీకు
ఏప్రాద్దు వినతులర్పించే వివేకంకూడ ప్రసాదించు.