పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విూరు ఆ పక్షులకంటె విలువైనవాళ్ళ కారా?
విూరు ఎంత ఆందోళనం జెందితే మాత్రం
దేవుడు మియాకు నిర్ణయించిన ఆయుష్మాలంకంటె
ఒక్కక్షణం అదనంగా జీవించగలరా" అన్నావు.

ఇంకా నీవు భూమివైపు చూపించి
"బట్టలకొరకు విూరింతగా విచారించాలా?
ఆ పొలంలో యెదిగే గడ్డిమొక్కలను చూడండి
అవి శ్రమపడి పనిజేయవు, ಬಳ್ಳಿಲು నేసికోవు
ఐనా మహావైభవంతో జీవించిన సొలోమోను మాత్రం
వాటి పూవుల్లాంటి సొగసైన దుస్తులు ధరించాడా?
నేడు పొలంలో ఎదిగి రేపు పొయ్యిలో మాడిపోయే
తృణజాలాన్నే దేవుడు ఈలాంటి బట్టలతో అలంకరిస్తే
మిూకింకా యెంత నాణెమైన దుస్తులు దయచేయడు" అన్నావు.
కనుక ప్రభూ! మేము కూడుగుడ్డ యిల్లవాకిలి
అనే తాపత్రయాల్లో బడి కొట్టుకొనిపోగూడదు
భగవంతుని నమ్మని అభాగ్యలకుగాని
మాకు తగవు ఈలాంటి చింతలు
మమ్మ పోషించే పరలోకపు తండ్రికి
ముందుగానే తెలుసు మా అక్కరలన్నీ
మొదట ఆ తండ్రినీ అతని రాజ్యాన్నీ ఆశిస్తే చాలు
ఈ లోకవస్తువులన్నీ వాటంతట అవే సమకూరుతాయి.

22.పుట్టువునిచ్చే తండ్రి

కీర్త 8. సొలోమోను జ్ఞాన 11,24-26

తండ్రీ! నీ భక్తుడైన కీర్తనకారుడు నరుడ్డిజూచి విస్తుపోయాడు
"దేవా! నీవు సృజించిన యీ విశాలాకాశాన్నీ
మింటివిూద నీవమర్చిన చంద్రతారకలనూ తిలకింపగా
ఈ అల్పమానవుడు ఏపాటివాడు అన్పిస్తుంది
ఐనా నీవు ఈ క్షుద్రనరుణ్ణి స్మరించుకొంటావు