పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాత్కాలికంగా సుఖపెడితే పెడతాయేమో గాని లోకవస్తువులేవీ మాకు శాశ్వతసుఖాస్నీయలేవు హృదయశాంతి నీనుండేగాని వస్తుసంచయంనుండి రాదు ప్రభూ! ఈ గొప్ప సూత్రాన్ని జీర్ణం చేసికొని" ప్రపంచవస్తువుల కంటిపెట్టుకొనకుండా వుండే వరాన్ని నీ దాసులమైన మాకు నిత్యమూ దయచేస్తూండు.

10. కోడికూయక మునుపే

లూకా 22,54–62. మత్త 26,31-35

 ప్రభూ! నీవు ఒలీవ కొండమిూద శిష్యులతో మాటలాడుతూ
"నేను గొర్రెల కాపరిని వధిస్తాను
మందంతా చెల్లాచెదరౌతుంది - అనే వేదవాక్యం నెరవేరుతుంది
మిూరంతా నన్ను విడనాడి వెళ్ళిపోతారు" అని చెప్పావు
అందుకు పేత్రు వీళ్ళంతా నిన్ను పరిత్యజించినా
నేను మాత్రం నిన్ను విడనాడను అని బింకాలు పల్కగా నీవు
"ఈ రాత్రి కోడికూయకమునుపే నీవు నన్నెరుగనని
ముమ్మారు బొంకుతావు" అని అతన్ని హెచ్చరించావు
కాని పేత్రు యిరికా రోషం తెచ్చుకొని
అవసరమైతే నీకోసం ప్రాణాలైనా అర్పిస్తాను గాని
నిన్ను మాత్రం త్యజించను అన్నాడు పెద్దగా గొంతుచేసికొని
ఈలాంటి పేత్రే ఒలీవతోటలో మూడుసార్లు కునుకుతీసాడు
యూదా అపరాత్రిలో దండుతో వచ్చి నన్ను బంధింపగా
అందరిలాగే తానూ బ్రతుకుజీవుడా అని కొలికి బుద్ది చెప్పాడు
అటుపిమ్మట ప్రధానయాజకుడైన కయిఫా యింట
ఓ పనిపిల్లకు దడిసి ముమ్మారు నిన్నెరుగనని బొంకాడు
అతడాలా బొంకుతుండగానే నీవు నుడివినట్లే
కొక్మొరోకో అని కోడి కూయనే కూసింది
అప్పడు శత్రువులు నిన్ను బంధించి తీసికొనిపోతూండగా
నీవు వెనుకకు మళ్ళి జాలితో పేత్రువైపు చూచావు

210