పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీవేమో నీ బోధలనే బీజాలను
ఎప్పడూ వెదజల్లుతూనే వుంటావు
విత్తనాల కేమిూ కొదువలేదు
బైబులు గ్రంథమంతా నీ విత్తనాలే
కాని మంచి నేలకు మాత్రం ఎప్పడూ కొదవే
మంచి నేలలాంటి హృదయాలుకల భక్తులెందరు?
కావున మా హృదయాలు
తొలిమూడు రకాల పాడునేలల్లా కాకుండ
ఆ సారవంతమైన నాల్గవరకం నేలలా వుంటే
మాకు ఫలితం దక్కుతుంది

2. హృదయ దేవాలయం


దర్శ 3,20, యోహా 14,23, 1కొ 6,19


ప్రభూ! నీవు మా హృదయద్వారాన్ని
మెల్లగా తడతావు
నీ రాకడనుగూర్చి మమ్ము హెచ్చరిస్తావు
ఐనా మమ్మ నిర్బంధం చేయవు
మేమే హృదయమనే తలుపు తెరచి
నిన్ను మా అంతరంగంలోని కాహ్వానించాలి.
అలా ఆహ్వానించిన భక్తులకు నీవు అతిథిమోతావు,
స్నేహితుడవై వాళ్ళను పరామర్శిస్తావు

నీ యాజ్ఞ పాటించేవాళ్లు నీకు ప్రియపడతారు
అప్పడు నీవూ నీ తండ్రీ విచ్చేసి
వాళ్ళ హృదయ కమలంలో
నివాస మేర్పరచుకొంటారు

నీవు నెలకొనివున్న ఆలయం దేవాలయం
సాన్నిధ్యం వలన అది పవిత్రమందిర మౌతుంది
కాని జ్ఞానస్నాన సమయమునుండే నీ యాత్మ
ఓ దేవాలయంలోలాగ