పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. ఇతరులలో క్రీస్తునిచూచి వాళ్లను ఉన్నవాళ్ళను ఉన్నట్లుగా అంగీకరిస్తుంటానా? నా అవసరాలనూ అభిరుచులనూ ఇతరులకు అనుకూలంగా వుండేలా సరిదిద్దుకొంటుంటానా?
12. నేను ఇతరులలోని మంచిని చూస్తుంటానా? వాళ్ళను గూర్చి చెడ్డగా తలంచకుండా వుంటానా?
13. నా సుఖాన్ని గూడ త్యజించి తోడి సభ్యుల అవసరాలను తీర్చడానికి సిద్ధంగా వుంటానా?
14. నావలన సామూహిక జీవితం ఏ విధంగాను దెబ్బతినక వృద్ధిలోకి వస్తూందా?
15. ఇతర సభ్యుల ఇష్టానిష్ణాలను గమనించి వాళ్లపట్ల మృదువుగాను ఆప్యాయంగాను మెలుగుతుంటానా?
16. నేను ఇతరుల విజయాన్నీ ప్రసిద్ధినీ చూచి అసూయకు గురిగాక, మనస్పూర్తిగా సంతోషిస్తుంటానా?
17. ఇతరుల భావాలను విలువతో చూస్తుంటానా? సత్యమెక్కడున్నా అంగీకరించడానికి సిద్ధంగా వుంటానా?
18. నా మాటల్లోను చేతల్లోను చిత్తశుద్ధి కన్పిస్తుంటుందా?
19. ఇతరులు నాకు ద్రోహం తలపెట్టినపుడు, లేదా తలపెట్టారని నేను అనుమానించినపుడు, వాళ్ళను క్షమించడానికి సిద్ధంగా వంటూనా?
20. ఇతరుల లోపాలనూ బలహీనతలనూ చూచి విస్తుపోక, వాళ్ళను సానుభూతితో సవరిస్తుంటానా?

3. ప్రేషిత సేవ



21. నేను సోమరితనానికి లొంగక దైవరాజ్య వ్యాప్తికి శ్రమించి కృషిచేస్తుంటానా?
22. ప్రజలను నా చెంతకు రాబట్టుకోక దేవుని చెంతకు రాబడుతుంటానా?
23. ఆ పౌలులాగే దైవసేవను సంతృప్తికరంగా చేయకపోతే దేవుని శిక్షకు గురౌతాననినమ్ముతుంటానా? (1Ց" 9, 16)
24. నా సేవలోని లోపాలను సవరించుకొని నాడునాటికి ఇంకా సమర్థవంతంగా కృషిచేస్తుంటానా?
25. నాలాగే దైవసేవచేసే యితర వ్యక్తులతోను బృందాలతోను నేను సహకరిస్తుంటానా?