పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా కష్టసుఖాలను ప్రభువుకి అర్పించుకొంటుంటానా? శోధనల్లో అతనినుండి సహాయం అడుగుకొంటుంటూనా?

4.ప్రభువు దివ్యనామాన్ని గౌరవప్రపత్తులతో చూస్తుంటానా? దేవదూషణలద్వారా, అబద్ధసాక్ష్యాల ద్వారా, ప్రమాణాలు శాపవచనాలద్వారా ఆ నామాన్ని అమంగళం చేస్తుంటావా? దేవమాతకు, దేవదూతలకు, పునీతులకు అగౌరవం కలిగేలా మాటలాడుతుంటూనా?

5.ఆదివారాల్లోను పండుగ దినాల్లోను భక్తిశ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధిస్తుంటానా? ఆ దినాల్లో పూజబలిలో పాల్గొంటుంటానా? సంవత్సరానికి ఒకసారయినా మంచి పాప సంకీర్తనము చేసి దివ్యసత్రసాదాన్నిస్వీకరించాలనే నియమాన్ని పాస్యకాలంలో నెరవేర్చుకొంటుంటానా?

6.డబ్బు, మూఢనమ్మకాలు, సుఖభోగాలు కీర్తిప్రతిష్టలు మొదలైన దబ్బరదేవతలను కొలిచి వాటిని దేవునికంటె అధికంగా సేవించడం లేదు కదా?

2. నేను మిమ్మ ప్రేమించినట్లే మీరూ ఒకరి నొకరు ప్రేమించండి

- యేహో 13, 34.

1.నేను తోడి నరులను యథార్థంగా ప్రేమిస్తుంటానా? వాళ్ళను నా స్వార్ణానికి వాడుకోవడం లేదా? వాళ్లు నాకేమి చేయడానికి ఇష్టపడనో వాళ్ళకు నేనది చేయడం లేదా? నా మాటలద్వారా, చేతలద్వారా ఇతరులకు దురాదర్శం చూపించడంలేదా?

2.నా సంసార జీవితంలో యథార్థమైన ప్రేమద్వారా కుటుంబ సభ్యులను సంతోషపెడుతుంటానా? నేను నా తల్లిదండ్రులకు విధేయుడనై యుండి వాళ్ళకు కావలసిన సహాయం చేస్తుంటానా? నా బిడ్డలను క్రైస్తవమార్గంలో పెంచు తుంటానా? వారికి మంచి ఆదర్శాన్ని చూపించి, నిజమైన తండ్రిలాగ వాళ్ళకు శిక్షణ నిస్తుంటానా? నా హృదయంలోను నేను ప్రవర్తించేతీరులోను నా భార్యపట్ల (భర్తపట్ల) విశ్వాసపాత్రంగా మెలుగుతుంటానా?

3.నా" సాత్తును లేనివాళ్ళతో పంచుకొంటానా? దరిద్రులకూ, పీడితులకూ దుఃఖార్తులకూ నా శక్తికొలది సాయం చేస్తుంటానా? పేదలనూ, రోగులనూ, వృద్దులనూ, బాధారులనూ అనాదరం చేయనుగదా?