పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10.నేను ఇతరుల శక్తిసామర్థ్యాలను గుర్తించి గౌరవిస్తుంటానా? ఇతరులను ప్రోత్సహిస్తుంటానా?

11.ఇతరుల కృషిని మెచ్చుకొంటుంటానా? ఇతరుల విజయాన్ని చూచి సంతోషిస్తుంటానా లేక అసూయ చెందుతుంటానా?

12.మంచిని సాధించడానికిగాను ఇతరవ్యక్తులతోగూడ కలసి పనిచేయడానికి సుముఖంగా వుంటానా?

ప్రార్ధనం

ప్రభూ! నీవు ఒక్కో నరునికి ఒక్కోరకం శక్తిసామర్థ్యాలు దయచేస్తుంటావు. నీవు నాకు దయచేసిన వరాలను నేను చక్కగా గుర్తించేలా చేయి. నా శక్తికొలది వాటిని వృద్ధిచేసి కొనేలా అనుగ్రహించు. ఆ వరాలతో నీకూ తోడిరపజలకూ సేవలుచేసే భాగ్యాన్ని గూడ ప్రసాదించు – ఆమెన్,

9. భగవంతుడూ, తోడినరులూ, నేనూ

1.నీ ప్రభువైన దేవుణ్ణి నీ పూర్ణహృదయంతో ప్రేమింతువుగాక -

మార్కు 12, 30

1.బిడ్డడు తండ్రివలె నేను దేవుణ్ణి ప్రేమిస్తుంటానా? అతన్ని అన్నిటికంటె అధికంగా ప్రేమించి అతని యాజ్ఞలను పాటిస్తుంటానా లేక ఈ లోకవస్తువులనే దేవుని కంటే అధికంగా ప్రేమిస్తుంటానా? ఆయా పనులను చేసేపుడు నా హృదయంలోని ఉద్దేశం పవిత్రంగా వుంటుందా?

2.నేను ప్రభుని గట్టిగా విశ్వసిస్తుంటానా? శ్రీసభ బోధలను అంగీకరిస్తుంటానా? నాడునాటికి విశ్వాసంలో పెరుగుతున్నానా? ఆ విశ్వాసానికి వ్యతిరేకంగా వచ్చే శోధనలను జయిస్తుంటానా? కష్టనష్టాలు వచ్చినా దేవునిపట్ల నాకున్న విశ్వాసాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తుంటానా? ఆంతరంగికంగా బహిరంగంగా గూడ నేను క్రైస్తవుణ్ణని నిరూపించుకోవడానికి సంసిద్ధంగా వుంటానా?

3.ఉదయ సాయంకాలాల్లో భక్తితో జపం చేసికొంటుంటానా? ప్రార్ధనం? చేసికొనేపడు హృదయాన్నిదేవునివైపు త్రిప్పతుంటానా లేక వట్టినే ఏవో జపాలు వల్లెవేస్తుంటానా?