పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7.శత్రువుని డెబ్బదియేడుసార్లు గూడ క్షమించాలి — మత్త 18, 21 22. నాలో క్షమాగుణం వుందా?

8.చెడ్డను చెడ్డతో వారించగూడదు. రోమా 12,21, ఒక చెంపన కొడితే మరో చెంప చూపించాలి - మత్త5, 38–42. నేను నా కపకారం చేసినవాడికి ప్రతీకారం చేయడం లేదా?

9.క్రీస్తు శిష్యులకు గుర్తు సోదరప్రేమే - యోహా 13, 35 ఈ గుర్తు నాలో కన్పిస్తుందా?

10.ఉన్నవాడు లేనివానితో పంచుకొని తన ప్రేమను క్రియాపూర్వకంగా చూపించాలి - 1యోహా 8, 16-18, యాకో 2, 15-16. నేను లేమిలోవున్న తోడివాడికి ఏదైనా ఈయడానికి ఇష్టపడతానా?

11.కంటికి కన్పించే తోడినరుణ్ణి పట్టించుకోనివాడు కంటికి కన్పించని భగవంతుణ్ణి పట్టించుకోడు - 16యోహా 4, 20-21. ఈ సూత్రం ప్రకారం నేను తోడినరుణ్ణి ప్రేమించకుండానే భగవంతుణ్ణి ప్రేమిస్తున్నానుకదా అది చాలులే అనుకొంటే సరిపోతుందా?

12.మనం ప్రేమతో ఒకరికొకరం సేవలు చేయాలి - గల 5,13. నేను తోడివాణ్ణి పరామర్శిస్తుంటానా?

13.ఇతరులను మనకంటె యోగ్యులనుగా భావించాలి - రోమా 12, 10. ఫిలి 2,3. కాని నేను ఇతరులకంటె నేనే యోగ్యణ్ణి అనుకోవడం లేదా?

14.క్రీస్తు దేహమైన క్రైస్తవ ప్రజల్లో తారతమ్యాలు ఉండకూడదు - గల 3, 28. కాని నాకు కులం పట్టింపులు లేవా?

15..క్రీస్తుదేహాన్ని విభజించగూడదు - 1కొ 1, 10-13. కాని. నేను మఠాలనూ పక్షాలనూ తయారు చేయడం లేదా?

16.ఒకరి భారాన్ని ఒకరు భరించాలి - గల 6,2. నేను, ఇతరుల దోషాలనూ లోపాలనూ సహిస్తూంటానా?

17.అన్ని పుణ్యాలనూ ఐక్యపరచే సాధనం సోదరప్రేమ - కొలో 3, 14 కాని నాలో అదే ప్రధానంగా లోపిస్తే?

18.ప్రేమ అసూయపడదు, డప్పాలుకొట్టదు, ఉబ్బిపోదు, అమర్యాదగా ప్రవర్తించదు, తన స్వార్ణాన్ని తాను చూచుకోదు, కోపపడదు, అపకారాలను మనసులో పెట్టుకోదు, కీడునుగూర్చి కాక మేలునుగూర్చి సంతోషిస్తుంది - 1కొ 13, 4-7. ఈ యెన్మిది సూత్రాలు నా కెంతవరకు వర్తిస్తాయి?