పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23. పరలోకానికి విరోధంగా పాపం చేసాను - లూకా 15, 21.

దుడుకు చిన్నవాని కథ మనకు తెలుసు. అతడు తండ్రియాస్తిని దూరదేశాల్లో దుర్వ్యయం చేసాడు. దుష్టజీవితం జీవించాడు. కాని కరవకాలంలో కన్నుదెరసి, తన పాడు పనులకు పశ్చాత్తాపపడి మల్లా తండ్రియింటికి తిరిగివచ్చాడు. తండ్రిని కలిసికోగానే అతడు "నీకూ పరలోకానికి విరోధంగా పాపం చేసాను" అన్నాడు. ఆ చిన్నవాడు తండ్రి ప్రేమను నిరాకరించాడు గనుక తండ్రికి వ్యతిరేకంగా పాపం చేసాడు. కాని మనం చేసే పాపాలు తోడిప్రజలకు మాత్రమే గాదు భగవంతునికి గూడ విరోధంగా వుంటాయి. (ఈ వాక్యంలో పరలోకం అంటే భగవంతుడు) కాబట్టి నరునికి విరోధంగా పోవడంగాదు, మరి భగవంతునికి విరోధంగా బోవడం పాపంలోని ప్రధానాంశం, పాపం సాధ్యమైతే దేవుణ్ణికూడ నాశం చేయాలని చూస్తుంది. పాపంలో యింత ఘటోరత్వం వుంది. ఈలాంటి పాపకార్యాలు చేసే మనం కూడ పశ్చాత్తాప పడుతూండాలి. హృదయశుద్ధికి వేరొక మార్గం లేదు.

24. ప్రభువు పశ్చాత్తాప ప్రియుడు - నిర్గ 34, 7.

పాపంవల్ల కోపాన్ని పశ్చాత్తాపంవల్ల శాంతిని ప్రదర్శించేవాడు యావే ప్రభువు. నూతవేదంలోని ప్రభువు కూడా పశ్చాత్తాప ప్రియుడు. జక్కయ పేదల నోళ్ళగొట్టి బ్రతికే పాపి అయినా అతడు పశ్చాత్తాప పడగానే ప్రభువు "నేడు ఈ ఇంటికి రక్షణం లభించింది" అన్నాడు - లూకా 19,9 ఓ పాపాత్మురాలు తన దుష్టజీవితాన్ని తలంచుకొని చిత్తశుద్ధితో పరితాపపడింది. తన కన్నీటిబొట్లతో ప్రభుపాదాలు ఆర్ధం చేసింది. ప్రభువు వెంటనే ఆమెను కరుణించి “ఈమె అధికంగా ప్రేమించింది గనుక ఈమె విస్తార పాపాలుగూడా క్షమించబడ్డాయి" అన్నాడు - లూకా 8,47. మరో సందర్భంలో వ్యభిచారిణి నొకరైను రాళ్ళతో గొట్టి చంపబోయారు యూదులు. అంతలో ప్రభువు ఆవైపువెళు ఆమెను రక్షించి కాపాడాడు. "ఇక వెళ్ళి పాపం చేయకుండా బ్రతుకు" అని మాత్రం మందలించాడు - యోహా 8,11. పశ్చాత్తాప హృదయుల పట్ల ప్రభువు చూపే కారుణ్యం ఈలాంటిది. ఈలాంటి సన్నివేశాలు బైబుల్లో చాలా వున్నాయి. భక్తుడు ఈలాంటి సన్నివేశాలను మననం చేసికొని జీర్ణానికి తెచ్చుకొంటూ వుండాలి.

25. ఎవరైనా పాపం లేదనుకుంటే - 1మోహా 2,1.

మనం పాపం చేయగూడదు. కాని బలహీనత వల్ల పాపంలో పడిపోయినటైతే, పశ్చాత్తాపపడి ప్రభువు నెదుట మన పాపాన్ని ఒప్పకోవాలి. అతడు తండ్రి యెదుట మన