పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7.హృదయానికుండే కపటం దేనికీ లేదు - యిర్మీ 17, 9–10. ఏ పుట్టలో ఏపాముందో? నాహృదయంలో ఏ విషసర్పం బుసకొడుతుందో? 8.ఈ ప్రజలు నన్ను పెదవులతో గౌరవిస్తున్నారుగాని వీళ్ళహృదయాలు మాత్రం నాకు దూరంగా వున్నాయి - యెష29, 13. మత్త 15, 8–9. నా యారాధనంలో నిజమైన భక్తి ఉంటుందా? 9. నేను సమర్పించుకొనే బలి పశ్చాత్తాపతప్తమైన హృదయమే అన్నాడు కీర్తనకారుడు - 51, 16-17 నా పాపాలకొరకు నేను మనస్పూర్తిగా పశ్చాత్తాపపడుతుంటానా? శోధనలు రానంతకాలం అందరూ భక్తులే. కాని 10.శోధనలు వచ్చాక నిజమైన భక్తుడెవడో తేలిపోతుంది. ప్రభువు అబ్రాహాముని శోధింపగా అతడు పరీక్షలో నెగ్గాడు - అది 22, 12. మరి నేను? 11.యూదా ఉమ్మడి సంచిలోని డబ్బు కొద్దికొద్దిగా కొట్టేస్తుండేవాడు - యోహా 12, 3-6. నేను ధనప్రలోభానికి తట్టుకొని నిలుస్తుంటానా? 12.ఐగుప్మలో పోతీఫరు భార్య తన్ను పాపకార్యానికి పురికొల్పగా యోసేపు “దేవుడు చూస్తుండగా నేను ఈలాంటి చెడ్డపనికి ఒడిగట్టలేను" అన్నాడు - ఆది 39, 710 ఆలాగే బాబిలోనులో ఇద్దరు వృద్దులు సూసన్నను బలత్కారం చేయగా ఆమె “ఈలాంటి పాడుపనికి పూనుకొని దేవుని యెదుట పాపం కట్టుకోవడంకంటె మీరు పెట్టే శిక్షననుభవించడమే మేలు" అంది — దాని 13, 19. లైంగికశోధనలు బలంగా వచ్చినపుడు నా ప్రవర్తనం ఏలా వుంటుంది? 13. యోహాను యాకోబు ఇతరశిష్యులకి తెలియకుండా తల్లిని వెంటబెట్టుకొని వచ్చి క్రీస్తురాజ్యంలో పెద్దపదవులు కొట్టేయబోయారు - మత్త20, 20-24 పదవులూ గౌరవాలూ దక్కించుకోవడం కోసం నేను మాత్రం మోసానికి పాల్పడ్డంలేదా? 14.యూదులు బాహ్యశుద్ధి ముఖ్యమనుకొన్నారు. కాని ప్రభువు హృదయశుద్ధి ముఖ్యమని బోధించాడు - మత్త 15, 19–20. అతడు కోరినట్లుగా నా అంతరంగం శుద్ధంగా వుంటుందా? 15 .సిలువమీద తెరువబడిన ప్రభువు హృదయం మన హృదయంమీద సోకి దాన్ని పనీతం చేస్తేనే తప్ప అది మారదు- యోహా 19,34. ఈ మార్పుని నేను మక్కువతో ఆశిస్తుంటానా?