పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12.మనం చేసే పనులన్నీ ప్రభువు పేరిట చేయాలన్నాడు పౌలు - కోలో 3.17. నా పనుల్లో నరుని మెప్పుకోరతానా లేక దేవుని మెప్పకోరతానా? 13.నేడు మన దేశంలో లక్షలకొలది మోసగాళ్ళ కష్టపడి పని చేయకుండానే డబ్బు ప్రోగుచేసికొంటున్నారు. వాళ్ళల్లో నేనూ ఒక్కణ్ణి కాదు కదా? 14.కృషితో నాస్తి దుర్బిక్షం అన్నారు. నా జీవితంలో ఎదుగూ బొదుగూ లేకపోవడానికి కారణం నా సోమరితనం కాదా?

ప్రార్ధనం

 ఓ ప్రభూ! నీవు నరుడు కష్టపడి పనిచేయాలని నిర్ణయించావు. ఐనా మాకు

పనిచేయాలంటే అనిష్టంగా వుంటుంది. ఎప్పడూ పనినుండి తప్పించుకోజూస్తాం. SP) చివరికి మమ్మ రక్షించేదీ శిక్షించేదీ కూడ మేము చేసే పనే. కనుక మేము వళ్ళు దగ్గరబెట్టుకొని మా బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తించే భాగ్యం దయచేయీ-అమెన్.

5.చిత్తశూద్దీ

1.నరుడు వెలుపలి రూపాన్ని మాత్రమే చూస్తాడు. కాని దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు - 1సమూ 16,7. నా హృదయంలోని కోరికలు ఏలా వుంటాయి? 2. పాతాళలోకంలో కూడ ప్రభువుకి తెలియంది కాదు, అంటే నరుని హృదయంలోని ఆలోచనలు అతనికి తెలియకుండా వుంటాయా - సామె 15,11. నా హృదయాలోచనలు తెలిస్తే ప్రభువునన్నుమెచ్చుకొంటాడా? 3.ప్రభువు కంటబడకుండా దాగివుండే దేదీలేదు - హెబ్రే 4, 18. నేను పాడు పనులు చేసి నరుల కన్నుకప్పతాను. కాని దేవుని కన్ను కప్పగలనా? ప్రభువు కండ్ల సూర్యునికంటె పదివేలరెట్ల కాంతిమంతంగా వుంటాయి, అవి నరులుచేసే పనులన్నీ గుర్తిస్తూనే వుంటాయి - సీరా 23, 19. అతడు అందరికీ కర్మసాక్షిగా వుంటాడు. మరి దుష్కార్యాలు చేసే నేను అతని యెదుట కన్నులెత్తుకొని తిరుగగలనా? 5.దేవుడు ఋజువర్తనులతో ఋజువుగాను, కపట వర్తనులతో కపటంగాను ప్రవర్తిస్తాడు - కీర్త 18,26, మరి ఆ ప్రభువు నా కపటానికి నాకు శాస్తి చేయడా?6. అసలు నేను కయీనులాగ కపటవర్తనుజ్జా లేక హేబెలులాగ సరళవర్తనుఃస్థా? - ఆది 4, 3–7.