పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. సర్వేశ్వరుని పండుగ దినాలను పరిశుద్ధపరచుదువుగాక

1. నేనుపూజ, పాపోచ్చారణం మొదలైన సంస్కారాల్లో భక్తితో పాల్గొంటుంటానా?
2. నా దేహాన్నీ హృదయాన్నీ దేవునికి ఆలయంగా వుంచుకొంటుంటానా?
3. గుడిలోలాగే నా హృదయంలో గూడ భగవంతునికి ఆరాధనం చెల్లిస్తుంటానా?
4. నా ఆరోగ్యాన్నీ శక్తినీ కాపాడుకోవడానికి అవసరమైనంతగా విశ్రాంతిని పొందుతుంటానా?
5. నేను తరచుగా దేవుని సాన్నిధ్యాన్ని గురుకి తెచ్చుకొని ఆ ప్రభువుని భక్తిభావంతో ఆరాధించుకొంటుంటానా?

4. తల్లిదండ్రులను గౌరవించుదువు గాక

1. క్రీస్తు,మరియా యోసేపులపట్లలాగ నేను నా తల్లిదండ్రులపట్ల గౌరవాదరాలు చూపుతుంటానా?
2. పెద్దలయెడల గౌరవమూ విధేయతా ప్రేమా చూపెడుతుంటానా?
3. నా క్రిందివాళ్లను అనురాగంతో చూస్తుంటానా?
4. క్రీస్తు శిష్యుల కాళ్లు కడిగినట్లుగా నేను తోడి ప్రజలకు సేవలు చేయడానికి సిద్ధంగా వుంటానా?

5. నరహత్య చేయకుందువుగాక

1. నేను తోడి నరులను గౌరవమర్యాదలతో చూస్తుంటానా?
2. ఇతరులమీద దౌర్జన్యం చేస్తుంటానా? వాళ్ళనుకోపించి కసురుకొంటుంటానా? దూషిస్తుంటానా?
3. ఇతరులను గూర్చి చెడ్డగా భావిస్తుంటానా? వాళ్ళమీద చాడీలు చెప్తుంటానా?
4. నా శత్రువులను క్షమిస్తుంటానా? వాళ్ళతో రాజీపడ్డానికి సిద్ధంగా వుంటానా? వాళ్ళకొరకు ప్రార్థిస్తుంటానా?
5. మంచివాళ్ళ పొలం మీదా చెడ్డవాళ్ళ పొలం మీదాకూడ వాన కురిపించే దేవుణ్ణి ఆదర్శంగా పెట్టుకొని (మత్త 5, 45) నేను అందరినీ అంగీకరిస్తుంటానా?
6. చెడ్డను చెడ్డతో వారించక (రోమా 12, 21) మంచితో వారిస్తుంటానా?