పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. అతన్ని రోజుపొడుగునా చాలసార్లు జ్ఞప్తికి తెచ్చుకొంటుంటానా? దానివలన నా హృదయంలో భక్తివిశ్వాసాలు పెరుగుతూంటాయా?

3. నాకు దేవుణ్ణి తలంచుకొన్నప్పటికంటె ఈ లోక్త వస్తువులను తలంచుకొన్నపుడు ఎక్కువ ఆనందం కలుగుతుందా?

4. నాకు ప్రార్ధనంమీద అభిరుచి వుందా?

5. దేవుని సన్నిధిలో ఏకాంతంగా కాలం గడపటమంటే నాకు సంతోషంగా వుంటుందా? నరులతో మాట్లాడినపుడు ఉల్లాసంగా వున్నట్లే దేవునితో మాట్లాడినపుడు ఆనందంగా వుంటుందా?

6. దేవుణ్ణి గురించీ ఆధ్యాత్మిక విషయాలను గురించీ మాట్లాడాలంటే నాకు ఇష్టంగా వుంటుందా?

7. నేను ఆయా ప్రాంపంచిక విషయాల్లో విజ్ఞానాన్ని ఆర్థించగోరినట్లే, భగవంతుణ్ణి గూర్చిగూడ విజ్ఞానాన్ని ఆర్థించ గోరుతుంటానా?

8. భగవంతుణ్ణి పట్టించుకోవడం అన్నిటికంటె ముఖ్యమైనదని భావిస్తుంటానా, ජීජු నెను పట్టించుకొనే నానావిషయాల్లో ఆ భగవంతుడుకూడ ఒకడా?

9. నేను ఆ ప్రభువు చిత్తాన్ని తెలిసికొని ఆ చిత్తం ప్రకారం జీవిస్తుంటానా?

10. దేవునికి సేవలు చేయాలనీ, ఆ సేవల్లో ఎన్ని బాధలైనా అనుభవించడానికి సిద్ధంగా వండాలనీ కోరుకొంటానా?

2. సర్వేశ్వరుని నామాన్ని వ్యర్థంగా పలుకకుందువుగాక

1. దేవునిపట్లా అర్యశిష్ణులపట్లా నాకు భక్తిగౌరవాలు వున్నయా?

2. నేను నిజంగా పాపిననీ అయోగ్యుడననీ భావిస్తుంటానా?

3. నేను అనుక్షణం దైవనామాన్ని నా హృదయంలోను పెదవుల మీదను నిల్పుకొంటుంటానా?

4. నాకు సత్యంపట్ల గౌరవం వుందా? ఆ గౌరవం వలన దొంగప్రమాణాలు చేయకుండా వుంటుంటానా? అనవసరంగా ఒట్ల వేసికోకుండా, శాపవచనాలు పల్కకుండా వుంటుంటానా.

5. దేవునికి చేసిన ప్రమాణాలూ మొక్కుబడులూ సకాలంలో తీరుస్తుంటానా?