పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17. నీవు "బిడ్డడు తండ్రిని అడిగినట్లే మీరూ నమ్మకంతో పరలోకంలోని తండ్రిని అడగండి" అని చెప్పావు 7,9-11. కాని మేము మా యక్కరల్లో నిన్ను ఆశ్రయించం, నమ్మకంతో నీకు ప్రార్ధన చేయం. నీవు ఓ అమ్మానాన్న లాంటివాడివని అర్థం చేసికోం

18. నీవు "ఇతరులు మీకేమి చేయాలని కోరుకొంటారో దాన్ని మీరు ఇతరులకూ చేయాలి" అని బంగారు సూత్రాన్ని బోధించావు - 7, 12 మేము ఇతరుల మమ్మ ఆప్యాయంగా చూడాలని కోరుకొంటాం. కాని మేము మాత్రం ఇతరులను ఆలా చూడం. మా యక్కరల్లో ఇతరులు మాకు తోడ్పడాలని ఆశిస్తాం. కాని మేము మాత్రం ఇతరులకు తోడ్పడం.

19. నీవు "ఇరుకైన ద్వారాన ప్రవేశించి, కష్టమైన మార్గాన ప్రయాణించి జీవాన్ని పొందండి" అని చెప్పావు - 7, 13-14, మేము మాత్రం విశాలమైన ద్వారాన ప్రవేశించి వినాశం తెచ్చుకొంటాం.

20 నీవు "నీబోధలను ఆలించి పాటించేవాడు రాతిపునాది మీద ఇల్ల కట్టినవాడి లాంటివాడనీ, వాటిని ఆలించి పాటించనివాడు ఇసుకపునాదిమీద ఇల్ల కట్టినవాడిలాంటివాడనీ" నుడివావు - 7,24-27 మే మసలు నీ గ్రంథమే చదవం. నీ బోధలు మా కట్టే తెలియవు. ఆ తెలిసినవాటిని గూడ మా జీవితంలో అంతగా ఆచరించం.

ప్రార్థనం

ప్రభూ!నీ బోధలు మాకు శాశ్వతజీవాన్ని దయచేస్తాయి. వాటిని పాటించినవాడికిఅమృతసిద్ధికలుగుతుంది. కనుక మేము ఈ లోకంలో నీ యాజ్ఞల ప్రకారం జీవించి పరలోకంలో నీ దర్శనభాగ్యానికి నోచుకొనేఅనుగ్రహం మా కందరికీ దయచేయి -ఆమెన్.

3. పదియాజ్ఞలు

నిర్గ 20, 1-17

1. సర్వేశ్వరుని మాత్రం ఆరాధించుదువు గాక

నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? అతనిపట్ల నాకు వ్యక్తిగతమైన అనుభవంవందా?