పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10.నీవు “మీరు ఇతరుల మెప్ప బడయగోరి మీ భక్తిక్రియలను పదిమందిముందు ప్రదర్శించవద్దు" అని ఆజ్ఞాపించావు - 6,1. మేము మా క్రైస్తవ జీవితంలో డంబం ప్రదర్శిస్తాం, హృదయంలో ఏమీ లేకపోయినా బయటికి మాత్రం భక్తిమంతుల్లాగ నటన చేస్తాం.

11.నీవు “మీరు ఈ లోకంలోగాక పరలోకంలో సంపదలు కూడబెట్టుకోవాలి” అని మందలించావు -6, 19-21. మేము కొండంత ఆర్భాటంతో ఈ లోకవస్తువులను కూడబెట్టుకొంటాం. మోక్ష సౌభాగ్యాలను ఆశించం. మా హృదయం ఎప్పడూ కూడూగుడ్డా ఇలూవాకిలీ అనే ఇహలోక వస్తువులమీదనే లగ్నమై వుంటుంది.

12. నీవు "నీ కన్ను నీ దేహానికి దీపం, నీ కన్ను తేటగా వుంటే నీ దేహమంతా వెలుగుతో నిండివుంటుంది" అని చెప్పావు - 6,22. తరచుగా మా వద్దేశాలు నిర్మలంగా వుండవు. మేము ఒకటి తలుస్తాం, ఇంకొకటి చెప్తాం, వేరొకటి చేస్తాం. మేము చిత్తశుద్ధి లేనివాళ్ళం.

13. నీవు "ఇద్దరు యజమానులను సేవించవద్ద"ని హెచ్చరించావు - 6,24. కాని మేము మాత్రం అటునిన్నూ కొలవబోతాం, ఇటు లోకవస్తువులనూ కొలవబోతాం.

14.నీవు "ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి కట్టుకొందామా అని ఆందోళనం చెందకండి" అని హెచ్చరించావు - 6,25, మేము చాలసారులు భవిష్యత్తును గూర్చి ఆందోళనపడతాం. ఈ లోకవస్తువులమీద ఆధారపడతాం గాని నమ్మకంతో మమ్మ మేము నీ చేతుల్లోకి అర్పించుకోము.

15.నీవు "మీరు మొదట దైవరాజ్యం కొరకూ ధర్మం కొరకూ కృషిచేయండి, అప్పడు ఇతర వస్తువులన్నీ మీకు లభిస్తాయి" అని వచించావు - 6,33. కాని మేము నీ రాజ్యాన్ని వ్యాప్తి చేయనూ లేదు, ధర్మం కొరకు కృషి చేయనూలేదు. మా స్వార్ణాన్ని మాత్రం బాగా పెంచుకొన్నాం. మా లాభాలనూ, మా సుఖభోగాలనూ మేము చూచుకొన్నాం.

16. నీవు "మీరు పరులను గూర్చి తీర్పు చేయకండి. అప్పడు దేవుడు కూడ మీకు తీర్పు తీర్చడు" అన్నావు - 7,1. మేము ఇతరులను అపార్థం చేసికొంటాం. విమర్శిస్తాం. ఆడిపోసికొంటాం.