పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2.నీవు "మీరు భూమికి ఉప్పలా వున్నారు. ఉప్ప తన ఒప్పందాన్ని కోల్పోతే మల్లా దానికాగుణం ఏలా అలవడుతుంది?" అని నుడివావు - 5, 13. మేము మా క్రైస్తవ, జీవితసారాన్ని కోల్పోయాం. ఇతరులకు మంచి ఆదర్శాన్ని ఈయలేకపోతున్నాం.

3.నీవు “మీ వెలుగుని ప్రజలయెదుట ప్రకాశింపనీయండి అప్పడు ప్రజలు మీ సత్కార్యాలను చూచి పరలోకంలోని తండ్రిని సన్నుతిస్తారు" అని నుడివావు - 6, 16. మేము మా వెలుగుని దాచిపెట్టుకొంటున్నాం. నీకు సాక్షంగా వుండలేకపోతున్నాం.

4. నీవు "నేను ధర్మశాస్తాన్నీ ప్రవక్తల బోధల్నీ రద్దుచేయడానికి రాలేదు" అని వచించావు - 5, 17. మేము నీ బోధలను జీర్ణం చేసికోనూలేదు, వాటిని పాటించనూ లేదు.

5. నీవు "పరస్టీని కామేచ్ఛతో చూచే ప్రతివ్యక్తి ఆమెతో మనసున వ్యభిచరించినట్లే" నని హెచ్చరించావు - 5,28. మా హృదయాలు దుష్టవాంఛలతో నిండివుంటాయి. మేము అపవిత్రమైన కోరికలు కోరుకొంటాం.

6.నీవు “నీ కుడికన్ను నీకు పాపకారణమైతే దానిని పెరికిపారవేయి" అని మందలించావు - 5,29. మేము పాపావకాశాలను వదలించుకోము. శోధనలు వచ్చినపుడు చిత్తశుద్ధితో ప్రవర్తించం.

7. నీవు "మీరు చెప్పదలచినదానిని ఔను కాదు అనే మాటలతో సరిపెట్టుకోవాలేగాని ఒట్లు పెట్టుకోగూడదు" అన్నావు - 5, 37. మేము సరళంగా మాట్లాడం. తీయని మాటలు చెప్పి ఇతరులను వంచిస్తాం.

8.నీవు "నీ కుడిచెంపమీద కొట్టినవానికి నీ యెడమ చెంపనుగూడ చూపించు" అని ఆదేశించావు - 5,39. మేము ఇతరులమీద ద్వేషం పెంచుకొంటాం. దీర్ఘకాలవైరం పెట్టుకొంటాం, శత్రువులకు ప్రతీకారం చేస్తాం.

9. నీవు "మీ శత్రువులను క్షమించండం, మిమ్మ హింసించే వాళ్ళ కొరకు ప్రార్ధించండి పరలోకంలోని మీ తండ్రిలాగే మీరూ పరిపూరులుగా వుండండి" అని నుడివావు - 5, 44-48. మేము మా కిష్టమైనవాళ్ళను మాత్రం ఎన్నుకొని మాకు గిట్టనివాళ్ళను కేటాయిస్తాం, నిన్ను ఆదర్శంగా బెట్టుకొని మాకు అపకారం చేసిన వాళ్ళకు ఉపకారం చేయం.