పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. ధన్యవచనాలు

మత్త 5, 1–10

ప్రభువు మనకు ఒక ఆదరాన్ని చూపించి పోయాడు. మనం కూడ ఆ యాదర్శం ప్రకారం జీవించాలని కోరాడు. ఆ యాదర్శం మనకు సువిశేషలలో, విశేషంగా ధన్యవచనాల్లో కన్పిస్తుంది. కనుక ఈ ధన్యవచనాల ప్రకారం జీవించే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని వినయవిశ్వాసాలతో ప్రభువుని మనవి చేద్దాం.

1.ప్రభూ! నీవు "దీనాత్మలు ధన్యులు, దైవరాజ్యం వాళ్ళది" అని బోధించావు. కాని మేము డబ్బుచేసికోవాలనీ, ఈ లోకవస్తువులను కూడబెట్టుకోవాలనీ ఉవ్విళ్ళూరి పోతుంటాం. వీటిని ఒకోసారి అన్యాయంగా గూడ అర్థిస్తుంటాం. వీటికి అంటిపెట్టుకొంటాం. ఇది మా తప్పిదం. నీవు లోకం యొక్క పాపాలను పరిహరించే సర్వేశ్వరుని గొర్రెపిల్లవి.

జవాబు : ప్రభూ! మా మీద దయ చూపండి.

(బృంద ప్రార్ధనం చేసికొనేపుడు ఈ జవాబును ప్రతిచరణం తర్వాత చెప్పాలి)

2. ప్రభూ! నీవు "శోకార్తులు ధన్యులు, వాళ్ళ ఓదార్చుని పొందుతారు" అన్నావు. కాని మేము మా కష్టాలనూ బాధలనూ భరించలేక చిర్రుముర్రులాడుతుంటాం. నీ మీద మొరపెడతాం. ఇతరుల కష్టాలనైతే అసలే పట్టించుకోం. నీవు లోకం యొక్క పాపాలను పరిహరించే సర్వేశ్వరుని గొర్రెపిల్లవి.

3. ప్రభూ! నీవు "వినములు ధన్యులు, వాళ్ళ భూమికి వారసులౌతారు" అని పల్మావు. కాని మేము అహంకారంతో విర్రవీగుతాం. దేవునిమీద కాక మా శక్తిమీద ఆధారపడతాం. నీవు లోకం యొక్క పాపాలను పరిహరించే సర్వేశ్వరుని గొర్రెపిల్లవి.

4. ప్రభూ! నీవు "నీతి నిమిత్తం ఆకలిదప్పలు అనుభవించే వాళ్లు ధన్యులు, వాళ్లు సంతృప్తి పొందుతారు" అన్నావు. కాని మేము సర్వనీతికినీ, సర్వధర్మానికినీ ఆధారానివైన నీ కొరకు ఆకలిదప్పులు అనుభవించం. మా జీవితంలో నీ బోధల ప్రభావానికి గురికాము. నిన్నూనీ సందేశాన్ని ఇతరులకు తెలియజేసే ప్రయత్నం గూడ చేయం. నీవు లోకం యొక్క పాపాలను పరిహరించే సర్వేశ్వరుని గొర్రెపిల్లవి.

5. ప్రభూ! నీవు "దయామయులు ధన్యులు, వాళ్లు దయను పొందుతారు" అని నుడివావు. కాని మేము ఇతరులను సులభంగా మన్నించం. తోడివారిపట్ల కటువుగా ప్రవర్తిస్తాం. వాళ్ళమీద సులువుగా తప్పపడతాం. నీవు లోకం పాపాలను పరిహరించే సర్వేశ్వరుని గొర్రెపిల్లవి.