పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దింపు అన్నాడు. కాని రెండవవాడు ప్రభువుని నమ్మాడు. అయ్యా! నీవు నీ రాజ్యంలో ప్రవేశించినపుడు నన్ను జ్ఞాపకముంచుకో అన్నాడు. అతడు కోరినట్టే ప్రభువు అతన్ని జ్ఞాపకం పెట్టుకొన్నాడు. తాను మోక్షప్రవేశం చేసినప్పడే మంచి దొంగకుకూడ మోక్ష భాగ్యాన్ని దయచేసాడు. ఆ దొంగ బ్రతికి వున్నపుడు చాల వస్తువులు దొంగిలించి వుంటాడు. కట్టకడన అతడు మోక్షాన్నిగూడ దొంగిలించాడు. మన మరణ సమయంలో మనంకూడ ఈ మంచి దొంగ జపాన్ని చెప్పకోగలిగితే మన జీవితం ధన్యమౌతుంది. మోక్షాన్ని పొందడంకంటె గొప్ప భాగ్యం ఏముంటుంది?

39. నీవు ప్రార్ధించేపుడు నీ సోదరుని క్షమించు - మార్కు 11, 25-26

మన ప్రార్ధన ఫలించాలంటే కొన్ని షరతులు పాటించాలి. దేవుడు ప్రేమమయుడు, శాంతిప్రియుడు, పగ, వైరం, ప్రతీకారబుద్ధి అతనికి గిట్టవు. కనుక తోడి నరుల మీద పగతీర్చుకోవాలనే కోరిక ప్రార్థనకు ఆటంకం కలిగిస్తుంది. కొన్నిసార్లు మన ప్రార్ధన ఫలించకపోవటానికి ఇది కారణం కావచ్చు. మన తరపున మనం శత్రువులను క్షమిస్తుండాలి. కొన్నిసార్లక్షమించబద్ధిపట్టదు. అప్పుడు మన్నించే గుణాన్ని దయచేయమని దేవుణీ అడుగుకోవాలి.

40. యేసు నామం మీదిగా - యోహా 14, 13-14

మనం ఎప్పడు కూడ యేసు నామం మీదిగా ప్రార్థన చేయాలి. యేసు నామమంటే యేసు అనే వ్యక్తి మన మనవి క్రీస్తుద్వారా తండ్రికి అర్పించాలి. ఎందుకు? మనలను రక్షించింది క్రీస్తు. మన కొరకు సిలువమీద చనిపోయి మనకు పాపపరిహారం చేసింది క్రీస్తు. కనుక అతని ద్వారానే రక్షణం. అతని ద్వారానే మన మనవిని తండ్రికి అర్పిస్తాం. నేరుగా క్రీస్తుకి కూడ మనవి చేయవచ్చు. ఎప్పడు కూడ యేసు అనే వ్యక్తి వలననే మన ప్రార్థన ఫలించేది. కనుక మన ప్రార్థనలో క్రీస్తుపట్ల నమ్మకం గౌరవం వండాలి. అతడే మనకు దిక్కు అనుకోవాలి.

41. ఆత్మ సాయపడుతుంది - రోమా 8, 27-28

మనం క్రీస్తుద్వారా తండ్రికి ప్రార్థన చేస్తాం. కాని ఆత్మ సహాయంతో ప్రార్ధన చేస్తాం. మనచేత జపం చేయించే మహాశక్తి ఆత్మ మనంతట మనం ఈ లోకానికి అంటిపెట్టుకొని వుంటాం. మనసు దేవునివైపు త్రిప్పకోలేం. అప్పుడు ఆత్మ మనచే ప్రార్ధన చేయిస్తుంది. అసలు తానే మనలో వుండి మనచే జపం చేయిస్తుంది. ఆ జపాన్ని దేవునికి