పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మశాస్త్రం, సువార్తబోధలు. ఈ బోధలను ఆలిస్తూ ప్రార్ధనచేసికునే క్రైస్తవ బృందం మధ్యలో గూడ క్రీస్తు సాన్నిధ్యం నెలకొని వుంటుంది. ప్రభువు ఈ బృందం ప్రార్థనను ఆలిస్తాడు. అంచేత విజ్ఞాపన ప్రార్ధనలు చేసేప్పడు బృందంగా కూడి వుండడం మంచిది. దేవాలయంలోని ఉదయ సాయంకాల ప్రార్థనలు, వడకాలు, సెమినార్లు ఈలా గుమిగూడే అవకాశాలను కలిగిస్తాయి. ఈలాంటి అవకాశాలు లేనపుడు ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా విజ్ఞాపన ప్రార్ధనం చేసికోవచ్చు.

19. ఓ సేవ

కొంతమంది భూదానం చేస్తుంటారు. కొందరు శ్రమ దానం, మరి కొందరు విద్యాదానం, ఇంకా కొందరు విత్తదానం చేస్తుంటారు. ఈ దానాలన్నీ మానవులు తోడి మానవుల కొరకు చేసే సేవలు. కాని సేవలన్నిటిలోను శ్రేష్టమైంది ప్రార్థనాసేవ. ప్రార్థనకు మించిన సేవ యెవరికీ చేయలేం. అసలు ప్రార్థనకు మించిన ఉపకారం లేనేలేదు. అంచేత ఎవరి కోసం ప్రార్ధిస్తున్నామో వాళ్ళకు మహోపకారం చేస్తున్నట్లుగా భావించాలి. "నీతిమంతుని విజ్ఞాపనం బహు బలంగలది" అంటుంది వేదవాక్యం - యాకో 5,16. మానవ బలం పనిచేయనపుడు ప్రార్ధనం దైవబలాన్ని కదలించుకొని వస్తుంది. అంచేత దైనందిన జీవితంలో మన ప్రార్ధనా సేవను తోడివారికి అర్చిసూ వుండాలి. తోడివారియొద్దనుండి ఈ సేవను పొందుతూండాలి.

20. క్రీస్తు విజ్ఞాపనం - హెబ్రే 7, 25

క్రీస్తు శరీరధారియై యున్నపుడు శిష్యులకోసం విజ్ఞాపనం చేసాడు అన్నాం. ఇక ప్రభువు ఉత్తానమైన పిదప విజ్ఞాన ప్రార్థనను మానివేయడు. ఉత్తానక్రీస్తు తండ్రి సమక్షంలో నిత్యమూ మనకోసం విజ్ఞాపనం చేసూవుంటాడు. తాను ఎవరికోసం శ్రమలనుభవించి ప్రాణాలు అర్పించాడో ఆ ప్రజలు ఇంకా భూలోకంలోనే వుండి శోధనలకు గురిఔతూ వున్నారని తండ్రికి నివేదిస్తాడు. తన ప్రార్థనల ద్వారా మనకు సమయోచితమైన సహాయాన్ని అనుగ్రహిస్తూనే వుంటాడు. తాను శోధింపబడి శ్రమలనుభవించినవాడు గనుక, నేడు శోధింపబడి శ్రమలనుభవిస్తూ వున్న మనకు సాయపడుతూంటాడు. మన తరపున ఆ ప్రభువు ఓ కృపాసింహాసనంలా వుంటాడు. కనుక మనం చనువుతో నమ్మికతో ధైర్యముతో ఆ ప్రభువు ప్రార్ధనలపై ఆధారపడుతూ వుండాలి. మన విజ్ఞాపనలన్నీ మోక్ష క్రీస్తు విజ్ఞాపనలతో చేర్చి పరలోకంలోని తండ్రికి అర్పిస్తూ వుండాలి.