పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16. తోబియా ప్రార్థన - తోబీతు 8,5-9

తోబీతు కుమారుడు తోబియా. తండ్రిలాగే అతడు కూడ నిర్మలంగా జీవించినవాడు. తోబియా మొదటిరాత్రి భార్యను కూడ బోతున్నాడు. అతడు జంతు వాంఛలకు లొంగలేదు. కామోద్రేకానికి గురికాలేదు. దేవునికి ఈలా ప్రార్ధన చేసాడు. "ప్రభూ! నీవు ఆదామును సృజించి అతనికి తోడుగా వుండటానికి ఏవను కూడ కలిగించావు. ఆ యాదిదంపతులనుండి మానవజాతి పుట్టింది. నరుడు ఒంటరిగా వుండడం మంచిదికాదు, అతనికి సాటియైన తోడును కలిగిస్తాను అనుకొన్నావు. ఇప్పడు నేను ఈ సారాను భార్యగా స్వీకరిస్తున్నాను. కామతృప్తి కొరకు కాక ఆదినుండి నీవు చేసిన ఏర్పాటుకులొంగి, అనగా స్త్రీ పురుషులు కలసికొని సంతానాన్ని కనాలి, భూమిమీద మానవ జాతిని కొనసాగించాలి అనే ఆజ్ఞకు లొంగి, ఈమెను స్వీకరిస్తున్నాను. ముసలి ప్రాయం వరకు మేమిద్దరం కలిసి జీవించే భాగ్యాన్ని దయచేయి". ఈ ప్రార్థనను బట్టి యిప్రాయేలు ప్రజలకు లైంగిక క్రియపట్ల ఎంత పవిత్ర భావాలు వుండేవో అర్థం జేసికోవచ్చు. ప్రపంచం స్త్రీ శరీరాన్ని ఆరాధించే ఈ రోజుల్లో ఈలాంటి ప్రార్థనలు మన కన్నులు తెరిపిస్తాయి.

17. యోబు వినయవిశ్వాసాలు - యోబు 42, 5-6

యోబు విశుద్ధవతర్తనుడు. ఐనా అతనికి కష్టాలు వచ్చాయి. అతని ఆస్తిపాస్తులు పోయాయి. కొడుకులు కూతుళ్లు చనిపోయారు. కుష్ఠవ్యాధి సోకింది. అతడు ఊరివెలుపల దిబ్బమీద కూర్చుండి చిల్లపెంకుతో పండ్లరసి గోకుకుంటున్నాడు. ఈ పరిస్థితిలో అతడు దేవునిమీద తిరగబడ్డాడు. నన్ను నిష్కారణంగా ఎందుకు బాధిస్తున్నావు అని అడిగాడు. యావే యోబుకి ఎదురుప్రశ్న వేసాడు. నా సృష్టి రహస్యాలను నీవు గ్రహింపగలవా అని అడిగాడు. యోబుకి కనువిప్పు కలిగింది. నేను పలికిన దుడుకుమాటలకు సిగ్గుపడు తున్నాను. దుమ్ము బూడిద మీద చల్లకొని పశ్చాత్తాపపడుతున్నాను అన్నాడు. ఈ పలుకులు యోబు వినయాన్ని విశ్వాసాన్ని తెలియజేస్తాయి. దేవుని మార్గాలు మనకు అర్థంకావు. అతడు మనకు కష్టాలు ఎందుకు పంపుతాడో మనం గ్రహించలేం. అతడు మాత్రం మన మేలు కోరుతాడు. కనుక మన తరపున మనం అతనికి లొంగివుండాలి.

18. దానియేలు నిజాయితీ - దాని 9,4-10

యిస్రాయోలు ప్రజలు దేవుని ఆజ్ఞలు మీరి శిక్షతెచ్చుకొన్నారు. బాబిలోనియా ప్రవాసంలో వున్నారు. వారి భక్తుడు దానియేలు. అతడు ప్రజల తరపున చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడ్డాడు. "దేవా! నీవు నిబంధనను పాటిస్తుంటే మేము దాన్నిమీరాం. మోషే

156