పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువు శ్రీహృదయమా!
నా ప్రేమనంతటినీ నీకే సమర్పిస్తున్నాను
 ఈ జీవితంలో నన్ను కాపాడేవాడివి నీవే
 నాకు రక్షణాన్ని దయచేసేది నీవే
నా పాపాలను పరిహరించేది నీవే
నా బలహీనతల్లో నన్నాదుకొనేది నీవే
 మరణసమయంలో నా కాశ్రయమయ్యేది నీవే కరుణగల ప్రభువు శ్రీహృదయమా!
 తండ్రి యెదుట నీవు నా తరపున మనవిచేయి
 పిత కోపాన్నుండి నన్ను కాపాడు
ప్రేమగల శ్రీహృదయమా! నేను నిన్నే నమ్మకొన్నాను
 నా బలహీనత నాకెంతైనా భయాన్ని పట్టిస్తుంది
 కాని నిన్ను స్మరించుకోగానే
 నా కెంతైనా నమ్మకం కల్గుతుంది
 నీ చిత్తాన్నెదిరించి నీకు అప్రియం కలిగించే గుణాన్ని
 నాలోనుండి పూర్తిగా తొలగించు
 నేను నిన్ను విస్మరించకుండా వుండేందుకు,
 నీ నుండి విడివడిపోకుండా వుండేందుకు
 నీ ప్రేమను నా యెదలో కుమ్మరించు
 కరుణ గల ప్రభూ!
 నీ పేరును నా హృదయంలో వ్రాసివుంచుకో
 నీ సేవకురాలినిగా జీవించి, నీ భక్తురాలినిగా మరణించే
 భాగ్యాన్ని నీవు నాకు ప్రసాదిస్తే అదే పదివేలు,

- భక్తురాలు మర్గరీత మరియు అలకోక్, 17వ శతాబ్దం

9. అమృతమయమైన జలాలు

ప్రభూ! సైనికుడు నీ ప్రక్కను శూలంతో పొడువగా
నీళ్ళూ నెత్తురూ స్రవించాయని పరిశుద్ధ గ్రంథం చెపూంది
మేము నీ హృదయాన్ని భక్తిభావంతో ధ్యానించుకోగా