పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. క్రీస్తుతో ఐక్యత

నా రాజువూ రక్షకుడవూ ఐన ప్రభూ!
 కరుణలేని యూటె మొనకు
 నీ హృదయం తెరుచుకోవాలని నీవు చిత్తగించావు
 నేను వినయంతో నీకు మొరపెట్టుకొంటున్నాను
నాకు నీ కరుణాకవాటం తెరువు
 పవిత్రమైన నీ పార్వంగుండ నన్ను లోనికి రానీయి
 ప్రేమపూరితమైన నీ హృదయంలోనికి నన్ను ప్రవేశింపనీయి
 నా హృదయం ఏనాటికీ నీ హృదయంనుండి
 విడవడకుండా వుండేలా చేయి
 ప్రభూ! నీ ప్రేమతో నా హృదయాన్ని గాయపరచు
 ఆ సైనికుని యూటె నా గుండెలోనికి చొచ్చుకొనిపోయేలాచేయి
 ఫలితంగా నా గుండెలో నీకు మాత్రమే చోటు వుండేలానూ,
పిశాచానికీ, ప్రపంచ వ్యామోహాలకూ దానిలో
 తావు దొరకకుండా వుండేలానూ అనుగ్రహించు.

- ఒక కార్తూప్యను భక్తుడు, 15వ శతాబ్దం.

4. ప్రభువు హృదిలోనికి అడుగిడు

ప్రభువు ప్రక్కలోని పవిత్ర క్షతమా!
 గాయాలన్నిటికంటె మధురమైన గాయమా!
 భక్తులెల్లరూ ప్రవేశించడానికి
లోతుగా తెరువబడిన శ్రీహృదయమా! నీ కివే నా వందనాలు
 ఈ యూటలోని జలాన్ని పానం జేసినవాడు,
 ఈ చెలమలోని ప్రేమను చవిజూచినవాడు
 తన బాధలన్నీ విస్మరిస్తాడు
 ప్రపంచ వ్యామోహాలనూ శారీరకేచ్చలనూ జయిస్తాడు
అతని డెందం స్వర్గసౌఖ్యాలను ఆశిస్తుంది
 అతని యుల్లం ఆత్మసాన్నిధ్యంతో నిండిపోతుంది
నిత్యజీవమిచ్చే జీవజలాల బుగ్గ అతని యొదలో వెల్లివిరుస్తుంది