పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. జీవజల నదులు

"పండుగ చివరిరోజు ముఖ్యమైనది. ఆదినం యేసు నిలచి బిగ్గరగా, దప్పికగొన్నవాడు నాయొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకోవచ్చు. లేఖనం చెప్పినట్లు, నన్ను విశ్వసించేవాని అంతరంగం నుండి జీవజలనదులు ప్రవహిస్తాయి అని చెప్పాడు" - అంటుంది యోహాను సువార్త 7, 37-38.

ప్రాచీన గ్రీకు లిఖితప్రతుల్లో ఈ వాక్యాలకు పాఠాంతరం కూడ వుంది. అది యిది. "దప్పికగొన్నవాడు నా యొద్దకు రావచ్చును. నన్ను విశ్వసించేవాడు దప్పిక తీర్చుకోవచ్చును. లేఖనం చెప్పినట్లు అతని (క్రీస్తు) అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి".

ఇక్కడ జీవజల నదులు ఎవరి అంతరంగం నుండి ప్రవహిస్తాయి? మొదటి పాఠం ప్రకారం క్రీస్తుని నమ్మిన భక్తుని అంతరంగంనుండి ప్రవహిస్తాయి. కాని రెండవ పారంప్రకారం అవి క్రీస్తు అంతరంగం నుండే ప్రవహిస్తాయి. బహుశ ఈ రెండవదే మెరుగైన పాఠం కావచ్చు. ఐనా ఈ రెండిటికీ అంత పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. జీవజల నదులు మొదట పుట్టేదేమో క్రీస్తు అంతరంగంలోనే. అవి ప్రవహించేదేమో ఆ క్రీస్తుని నమ్మిన భక్తని అంతరంగంలోకే .

కాని యిక్కడ "జీవజలనది" అంటే యేమిటి? "ఆయన తన్ను విశ్వసించేవాళ్ళు పొందబోయే ఆత్మనుగూర్చి ఈ జీవజలనది అనే మాటను వాడాడు" అని చెప్తుంది యోహాను సువిశేషం 7, 39. కనుక ఈ జీవజలనది పరిశుద్ధాత్మే ఈ యాత్మ మెస్సీయా కొనివచ్చే సకల వరప్రసాదాలకూ చిహ్నంగా వుంటుంది. ఈ జీవజలనది ప్రవచనం. తరువాత సిలువమీద క్రీస్తు పార్శ్వం నుండి యధార్థంగా కారిన నీళ్ళు ఈ ప్రవచనానికి నెరవేరుదల. ఈ యంశాన్ని మీదట విపులంగా పరిశీలిస్తాం.

ఇక్కడ క్రీస్తు "జీవజలనదులు ప్రవహిస్తాయి" అనే మాటలను పల్కిన సందర్భాన్ని కొంచెం పరిశీలించి చూద్దాం. పాలస్తీనాదేశం మన దేశంలాగే ఉష్ణదేశం. ఆదేశంలో నీళ్లు చాల ముఖ్యమైనవి. నీళ్ళు లేకపోతే పైరుపంటలూ ప్రాణులూ అన్నీ నశిస్తాయి. కనుక బైబులు సంప్రదాయంలో నీళ్ళు జీవానికే చిహ్నమయ్యాయి. మనం ఆధ్యాత్మిక జీవనం అని పేర్కొనే దాన్ని బైబులు జలంతో ఉపమిస్తుంది. అందుచేత బైబులు భాషలో జలం అంటే దివ్యజీవనం.

యెరూషలేములో గుడారాల పండుగ జరుగుతూంది. యూదులు ఉత్సవాలన్నిటి లోను ఇది మిక్కిలి ఆనందకరమైనది. ఈ పండుగ ఏడురోజులపాటు జరిగేది. కడచినయేడు