పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందు గొర్రెపిల్లను బలిగా అర్పించి దాని మాంసాన్ని భుజించాలి. దాని యెముకల్లో ఒకదాన్ని కూడ విరుగగొట్ట కూడదు. తరువాత యూదులు వాగ్డత్త భూమిలో స్థిరపడి అక్కడ యేటేట ఈ సంఘటనను పునశ్చరణం చేసికొనేపడు గూడ ఇదే నియమం వర్తిస్తుంది - సంఖ్యా 9, 12. అక్కడ కూడ వాళ్ళు గొర్రెపిల్ల ఎముకల్లో ఒక్కదాన్ని కూడ విరుగగొట్టకూడదు. ఈ రెండు సందర్భాల్లో కూడ ఈ నియమాన్ని చేసినవాడు ప్రభువే.

యోహాను ఈ నియమాన్ని ఈ ప్రవచనాన్నీ ప్రభువుకి వర్తింపజేసాడు. యిస్రాయేలీయులు వధించిన పాస్క గొర్రెపిల్ల కేవలం సాంకేతికమైంది మాత్రమే, యథార్థమైన పాస్క గొర్రెపిల్ల క్రీస్తే, ఈ గొర్రెపిల్ల యెముకల్లో ఒక్కదాన్ని గూడ విరుగగొట్టకూడదు. కావుననే సైనికులు చనిపోయి సిల్వమీద వ్రేలాడే క్రీస్తు దగ్గరికి వచ్చికూడ అతని కాళ్ళ విరుగగొట్టకుండా వెళ్లారు. ఐగుప్తలో వధించిన గొర్రెపిల్ల యిస్రాయేలు ప్రజల దాస్యవిముక్తికి చిహ్నం, కాని సిలువమీద బలియైన ఈ గొర్రెపిల్ల నూత్న ప్రజలమైన మన దాస్య విముక్తికీ, మన పాపపరిహారానికీ చిహ్నం.

2. రెండవ ప్రవచనం

వాళ్లు తాము పొడిచినవాని వంక చూస్తారు అనే ప్రవచనం జెకర్యా గ్రంథం 12, 10-11 నుండి ఉదాహరింపబడింది.

"నేను దావీదు వంశజులకును యెరూషలేము పౌరులకును
కరుణనూ ప్రార్ధనశక్తినీ దయచేస్తాను
వాళ్లు తాము పొడిచినవాని వంక చూస్తారు
నరుడు తన యేకైక కుమారునికొరకు శోకించినట్లే
వాళ్లు అతనికొరకు శోకిస్తారు
జనుడు తన తొలిచూలి కుమారునికోసం దుఃఖించినట్లే
వాళ్ళు అతని కొరకు గాఢంగా దుఃఖిస్తారు".

యెషయా ప్రవచనంలోని బాధామయ సేవకునిలాంటి వ్యక్తి యొకడు జెకర్యా ప్రవచనంలో కూడ కన్పిస్తాడు. జెకర్యా చిత్రించిన ఈ వ్యక్తిని యోహాను సిలువమీద బాధలనుభవించే క్రీస్తునిగా గుర్తించాడు. ఈ ప్రవక్త ప్రవచనం ప్రకారం ప్రజలు మూర్ధులై సేవకుణ్ణి పొడిచి చంపారు. అతడు చనిపోయాక వాళ్ళకు కనువిప్ప కలిగింది. దేవుడు వాళ్ళకు పశ్చాత్తాపం పుట్టించాడు. పుణ్యాత్ముడైన సేవకుణ్ణి చంపిన క్రూర ప్రజలే కడకు మనసు కరిగి అతని మరణానికిగాను శోకించారు. దేవుని అనుగ్రహం వలన వాళ్ళ మనసులు మారాయి. ఆ పుణ్యపురుషుని కొరకు వాళ్ళ దేవుణ్ణి మనవి చేసారు. ఆ