పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సువిశేషకారుడు చాల నొక్కిచెప్పాడు, యోహాను "దీనిని చూచినవాడు సాక్ష్యం చెప్తున్నాడు. అతని సాక్ష్యం నమ్మదగినదే" అంటున్నాడు, అనగా ఈ సంఘటనం యథార్థంగానే జరిగిందని నొక్కిచెప్తున్నాడు. ఇది చాలదో అన్నట్లు “అతడు సత్యం చెపున్నాడని అతనికి తెలుసు” అని ఒట్టగూడ పెట్టుకొంటున్నాడు.

ఈ వొట్టకూడ సువిశేషకారునికి తృప్తి కలిగించలేదు. కనుక అతడు రెండు ప్రవచనాలను ఉదాహరించి క్రీస్తు ప్రక్కను పొడవడమనే సంఘటనం యథార్థంగానే జరిగిందని నిరూపించాడు. అతని యెముకల్లో ఒకదాన్ని గూడ విరుగగొట్టరు, వాళ్లు తాము పొడిచిన వానివంక చూస్తారు అనేవి యిూరెండు ప్రవచనాలు. యోహాను సువిశేషంలో ఇంతగా నొక్కిచెప్పిన సంఘటనం మరొకటి లేదు, అతడు క్రీస్తుశ్రమలను గూర్చి ఇంతగా నొక్కి చెప్పలేదు, కడకు అతని మరణాన్ని గూర్చిగూడ ఇంత గట్టిగా చెప్పలేదు. క్రీస్తు చనిపోగా నేను చూచాను, ఇది వాస్తవంగా జరిగిన సంఘటనం అని వ్రాయలేదు. కాని అతడు క్రీస్తు ప్రక్కను పొడవడాన్ని మాత్రం నొక్కిచెప్పాడు. అనగా ఈ సంఘటనను అతడు అతిముఖ్యంగా భావించి వుండాలి.

పైరెండు ప్రవచనాలు ఏమి నిరూపిస్తాయి? క్రీస్తు ప్రక్కను పొడవడమనేది యాదృచ్చికంగా జరగలేదనీ, దేవుడు ఆ సంఘటనను ముందుగానే నిర్ణయించాడనీ అర్థం చేసికోవాలి. ఇంకో విషయంగూడ, సిలువవేయబడినవాళ్లు త్వరలో చనిపోవడానికి వాళ్ళ కాళ్ళ విరుగగొట్టేవాళు. అంతేగాని వాళ్ళ ప్రక్కను బల్లెంతో పాడిచేవాళ్లు కాదు. ఆలాచేయడం యూదుల చట్టానికీ రోమను చట్టానికీ గూడ విరుద్ధం. ఈలా చూచినాగూడ ఇది అసాధారణ విషయమేనని తెలుస్తుంది. కనుక దేవుడు ఈ సంఘటనాన్ని ప్రత్యేకంగా నిర్ణయించాడనే అర్థం చేసికోవాలి. కనుకనే శ్రీహృదయ పూజలో వచ్చే ఓ ప్రార్థనం "ఓ ప్రభూ! సిలువమీద వ్రేలాడే నీ యేకైక కుమారుణ్ణి సైనికుడు బల్లెంతో పొడవాలని నీవు నిర్ణయించావు" అని చెప్తుంది.

2. రెండు ప్రవచనాలు

సిలువమీద వ్రేలాడే క్రీస్తుకి రెండు కార్యాలు జరిగాయి. అతని కాళ్ళను విరుగగొట్టలేదు, అతన్ని బల్లెంతో పొడిచారు. ఈరెండు క్రియలూ జరుగుతాయని పూర్వవేద ప్రవచనాలు చెప్తున్నాయి కూడ. ఈ ప్రవచనాలను కొద్దిగా పరిశీలిద్దాం.

1. మొదటి ప్రవచనం :

అతని యెముకల్లో ఒకటిగూడ విరుగగొట్టబడదు అనే ప్రవచనం నిర్గమకాండం 12, 46 నుండి ఉదాహరింపబడింది. యిప్రాయేలీయులు ఐగుప్తనుండి బయలుదేరక