పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యావే యేపాటి దేవుడంటూ ఆ దూడను ఆరాధించడం మొదలుపెట్టారు. అంతలో మోషే తిరిగి వచ్చి ఆ వృషభారాధనను జూచి కంపించిపోయాడు. కోపంతో చేతిలోని రాతి పలకలను నేలకు విసరి కొట్టాడు. అప్పడు యావేకు గూడ ప్రజలమీద తీవ్రకోపం గలిగింది. ఈ ప్రజలను సర్వనాశం చేస్తాను అన్నాడు ప్రభువు. కాని మోషే ఆ ప్రజల తప్పిదాన్ని మన్నించమని ప్రభువునకు నలువది నాళ్ల విజ్ఞాపనలు చేసాడు.

11. యావే ప్రభూ, చెవియొగ్గి ఆలింపుము - 2 రాజు 19, 14-19.

హిజ్కియా చాలా భక్తిమంతుడైన రాజు. అతని రోజులలో సన్హెరీబు అనే అస్పిరియను రాజు దండుతో వచ్చి యెరుషలేము మీద దాడిచేసాడు. హిజియాను బెదరిస్తూ ఓ జాబు వ్రాసి పంపాడు. "ఎన్ని జాతులు నా వశమయ్యాయో చూడు. వాళ్లు క్రాలిచే దేవరలంతా యేమయ్యారు? నా చేతుల్లో నుండి తమ భక్తులను రక్షింపగలిగారా? నీ గతీ యింతే ఔతుంది. కాని నా శరణు పొందావో, నీవూ నీ పట్టణం బ్రతికిపోతారు" - ఇది అతని జాబు. హిజ్కియా ఆ జాబును చదివాడు. దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళాడు. దాన్ని ప్రభు పీఠంముందు విప్పిపెట్టి పట్టణం తరపున యావేకు విజ్ఞాపనం చేసాడు. ప్రభువు రాజు మొర నాలించి ప్రవక్తయైన యెషయా ద్వారా అతనికి ఓదార్పు మాటలు చెప్పించాడు. ప్రభుదూత అర్థరాత్రిలో అస్పిరియను సైనికులను కొందరిని చంపివేసాడు. అది చూచి సన్హెరీబు భయపడి పట్టణానికి అల్లంత దూరంనుండే పారిపోయాడు, హిజ్కియా విజ్ఞాపనం లాగే మన విజ్ఞాపనం గూడ తోడి ప్రజలను రక్షిస్తుంది.

12. ఇతడు పరిశుద్ధ పట్టణంకోసంమిక్కిలిగా ప్రార్థించాడు -2 మక్కబీ15, 12-16,

అంతియోకస్ ఎపిఫానీస్ అనే సిరియారాజు యెరూషలేముమీదకు ఎత్తివచ్చాడు. మక్కబీయుడైన యూదా ఎపిఫానిన్ను ఎదురించి పట్టణాన్ని కాపాడ్డానికి కంకణం కట్టుకున్నాడు. అతనికి ఓ కల వచ్చింది. ఆ కలలో ఓదర్శనం. ఆ దర్శనంలో ఓనియూ అనే ప్రధానయాజకుడు చేతులుచాపి యూదులందరి మీదికి దేవుని దీవెనలు దిగివచ్చేలా ప్రార్థన చేస్తూ వుండగా యూదా చూచాడు. అదే దర్శనంలోనే ప్రకాశవంతుడు మహాప్రతిభావంతుడునైన ఓ ముదుసలికూడ కనుపించాడు. ఇతడే యిర్మీయా ప్రవక్త. ఓనియా అతన్నియూదాకు చూపిస్తూ, "ఇతడు యూదా ప్రజలను ప్రేమించి వాళ్లకోసమూ పరిశుద్ధ పట్టణంకోసమూ మిక్కిలిగా ప్రార్థన చేసాడు సుమా" అని చెప్పాడు. అప్పడు యిర్మియా యూదాకు ఓ సువర్ణఖడ్డాన్ని ప్రసాదించి, వెళ్లి దానితో శత్రువులను హతమార్చమని చెప్పాడు. యూదా యీ దర్శనాన్ని అర్థంచేసికొని ఉత్సాహంతో యూద్దానికి వెళ్ళాడు. ఈ యిర్మీయాలాగే మనంకూడ తోడి ప్రజలకోసం మిక్కిలిగా ప్రార్ధనం చేస్తూవుండాలి.