పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. తెరువబడిన హృదయం

బైబులు భాష్యం -54

విషయసూచిక

1.యేసు ప్రక్కను బల్లెంతో పొడవడం
2.క్రీస్తు ప్రక్కలోనుండి నెత్తురు స్రవించడం
3.క్రీస్తు ప్రక్కలోనుండి నీళ్లు కారడం
4.శ్రీ హృదయ భక్తి
5.భక్తుల ప్రార్థనలు

1. యేసు ప్రక్కను బల్లెంతో పొడవడం

1. యేసు ప్రక్కను బల్లెంతో పొడవడం

సిలువమీద చనిపోయిన యేసు ప్రక్కను సైనికులు బల్లెంతో పొడిచారు. యోహాను సువార్త 19, 33–37 ఈ సంఘటనను ఈలా వర్ణిస్తుంది. 83, "సైనికులు యేసు దగ్గరికి వచ్చినపుడు అతడు అప్పటికే మరణించి వుండడం చూచి అతని కాళ్లు విరుగగొట్ట లేదు. 34 కాని సైనికుడొకడు అతని ప్రక్కను బల్లెంతో పొడిచాడు. వెంటనే నెత్తురూ నీరూ స్రవించాయి. 35. దీనిని చూచినవాడు సాక్ష్యం చెప్తున్నాడు. అతని సాక్ష్యం నమ్మదగినదే. మీరును విశ్వసించడానికి అతడు సత్యం చెప్తున్నాడని అతనికి తెలుసు. 36, “అతని యెముకల్లో ఒకటిగూడ విరుగగొట్టబడదు” అనే లేఖనం నెరవేరేటట్లుగా ఈ సంఘటనలు జరిగాయి, 37, "వాళ్లు తాము పొడిచినవాని వంక చూస్తారు" అని మరో లేఖనం కూడ చెప్తుంది".

పై వాక్యాల్లో రెండంశాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మొదటిది, సువిశేషకారుడు అప్రధానంలా కన్పించే ఓ అంశాన్ని పేర్కొన్నాడు. అదేమిటంటే క్రీస్తు ప్రక్కను బల్లెంతో పొడవడం. సైనికులు వచ్చేటప్పటికే క్రీస్తు చనిపోయాడు. అతన్ని బల్లెంతో పొడిచినందువల్ల ఎక్కువ బాధేమీ కల్గదు, క్రీస్తు కాళ్ళను విరగగొట్టలేదు కాని, ఒకవేళ విరగగొట్టినా అతనికి బాధేమీ కలిగేది కాదు. కనుక ఈ సంఘటనలు వట్టినే యాదృచ్ఛికంగా జరిగిన అప్రధానాంశాలేమో ననిపిస్తాయి. రెండవది, ఈలా అప్రధానంలా కన్పించే అంశాన్నే