పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ లోక పాపాలను పరిహరించే గొర్రెపిల్ల సాయంకాలం మూడుగంటలకు కొండకొమ్మన ప్రాణాలు విడుస్తూండగా అదే సమయంలో క్రింద యెరూషలేం పట్టణలో పాస్క విందుకు గొర్రెపిల్లలను వధిస్తున్నారు. పాపపరిహారానికి యూదులు వాటి నెత్తుటిని పీఠంమీద చిలకరిస్తారు. వాటి మాంసాన్ని భుజిస్తారు. ఈ తంతు పూర్వం ఐగుపులో జరిగిన మొదటి పాస్మబలిని పునశ్చరణం చేస్తుంది. పాస్క గొర్రెపిల్లలను వధించేదినాన్నే అదే సమయంలోనే, క్రీస్తునికూడ చంపారు. తొలి పాస్కవిందు జరిగిందీ, కయీను హేబెలును వధించిందీ, దేవుడు అబ్రాహాముతో నిబంధనం చేసికొందీ, అబ్రాహాము ఈసాకుని బలి యిూయడానికి తీసికొనిపోయందీ, యేసావు తన జ్యేష్ఠభాగాన్ని తమ్మునికి అమ్మకొందీ ఈ దినాన్నేనని రబ్బయిలు నుడివారు. వాళ్ళ మాటల్లో ఎంత సత్యముందో మనకు తెలియదు. ఒక్కటి మాత్రం నిజం. ఈ దినాన దేవుని గొర్రెపిల్లను కొండకొమ్మన బలి యిచ్చారు. ఒక్కసారి మాత్రమే అర్పింపబడిన ఈ యేకైక బలివలన మన పాపాలు శాశ్వతంగా పరిహారమయ్యాయి - హెబ్రే 10,10.

“తండ్రీ! నా ప్రాణాలను నీ చేతుల్లోకి అర్పిస్తున్నాను" అని చెపూ జీవల విడిచాడు క్రీస్తు. జీవితాంతమూ దైవప్రేమతో జీవించి దైవకార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన నరునికి ఇంతకంటె దివ్యమైన మరణం వుండదు. క్రీస్తు మరణాన్ని ఆదర్శంగా తీసికొని భక్తులు చాలమంది ఇదే వాక్యాలను ఉచ్చరిస్తూ తనువు చాలించారు. ఐతే క్రీస్తు తండ్రి చేతుల్లోకి లాగే వీళ్ళ క్రీస్తు చేతుల్లోకి తమ ప్రాణాలను అర్పించుకొన్నారు. దేవుడికి మానవుడికి మధ్య మధ్యవర్తి ఒక్కడు, క్రీస్తు, మన పాపాలను విమోచించి మనలను తండ్రి ఇంటికి చేర్చేవాడు అతడే మరి అతని చేతుల్లోకి గాకపోతే మరెవరి చేతుల్లోకి మన ప్రాణాల నర్పించుకొంటాం? కనుకనే సైఫను భక్తుడు "యేసు ప్రభూ! నీవు నా యాత్మను స్వీకరించు" అంటూ ప్రాణాలు విడిచాడు - ఆచ 7,59. క్రీస్తు శిష్యులమైన మనంకూడ ఈలాంటి ధన్యమైన మరణం మరణిస్తే ఎంత బాగుంటుంది?

స్వేచ్చాపరుడైన నరుని చిట్టచివరి కార్యం మరణం, క్రీస్తు తన మరణాన్నిదేవుని కర్పించినట్లే మనంకూడ మన మరణాన్ని క్రీస్తుద్వారా దేవునికి అర్పించాలి. మనం ఉదయకాల సమర్పణంలో రోజువారి పనులను దేవునికి అర్పిస్తూంటాం. కాని ఈ పనులు మన జీవితానికి చెందినవి, అవి మన జీవితమనే చెట్టుమీద కాసిన పండ్ల, ఈ పండ్లను దేవునికి అర్పించడం మంచిదే. ఐనా ఆ చెట్టనే దేవునికి అర్పిస్తే ఇంకా యోగ్యంగా వుంటుంది. అనగా మన జీవితాన్నీ మరణాన్నీ ఆ ప్రభువు చేతుల్లోకి అర్పించుకొంటే ధన్యాత్ములమౌతాం. వేయేల, మనం క్రీస్తుతో బాధలనుభవిస్తే అతనితో మహిమను పొందుతాం - రోమా 8,27. "క్రీస్తు అనుభవించిన కష్టమా! నాకు ఓదార్పు దయ చేయండి. నా మరణ సమయంలో నన్ను నీ సన్నిధికి రాజేయండి" అని ప్రార్ధించాడు ఇగ్నేప్యసు లొయోలా, ఈ భాగ్యం కోసమే మనమూ వేడుకోవాలి