పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నింపిపెట్టుకొన్నారు. అతడు నాకు దాహం వేస్తుందని చెప్పగానే ఓ సైనికుడు స్పోంజిని ఈ రసంలో మంచాడు. దానిని హిస్సోప అనే చెట్టుకొమ్మకు తగిలించి క్రీస్తుకి అందించాడు. ప్రభువు ఆ స్పోంజినుండి కొంచెం రసం పీల్చుకొన్నాడు - యోహా 1929.

పూర్వం పుణ్యస్త్రీలు ప్రభువుకి పరిచర్యలు చేసారు. వాళ్ళుకూడ ఇప్పడు సిలువదగ్గిరే నిల్చుండి వున్నారు. ఐనా ఇప్పడు వాళ్లు అతనికి ఏలాంటి సాయమూ చేయలేరు. ఓ సైనికుడే ప్రభువుకి ఆ సాయం చేసిపెట్టాడు. ఈ సైనికులు రోమనులు. వీళ్ళకు యూదులపట్ల సద్భావం లేదు. వీళ్లు సిలువమీద వ్రేలాడే క్రీస్తుని ఎగతాళి చేసారు కూడ ఇక్కడ ఈ రసాన్ని అందించినవాడుకూడ ఎగతాళికే ఈ పనిచేసాడు - మార్కు 15, 36. ఐనా ఈలా పరియాచకంగా అందించిన రసంతోనే ప్రభువు తన దాహం తీర్చుకొన్నాడు.

పులిసిన రసపు స్పోంజిని హిస్సోపు పల్లమీద తగిలించి క్రీస్తుకి ఇచ్చారు. ఈ హిస్సోపు కొమ్మను యూదులు కర్మకాండలో వాడేవాళ్ళు దాని కొమ్మను పాస్కగొర్రెపిల్ల నెత్తుటిలో మంచి ఆ నెత్తుటిని ప్రజలమీద చిలకరిస్తారు. పూర్వం ఐగుప్తులోని యూదుల యిండ్ల ద్వారబంధాల మీద గొర్రెపిల్ల నెత్తురు చిలకరించిందికూడ దీని మండతోనే. ఇంకా కుష్టరోగులను శుద్ధిచేసేపుడుకూడ ఈ మండను పక్షి నెత్తుటిలో ముంచి ఆ నెత్తుటిని రోగులమీద చల్లతారు. సుప్రసిద్ధమైన 51వ కీర్తనలో కీర్తనకారుడు తన్ను ఓ కుష్టరోగితో పోల్చుకొన్నాడు. ప్రభువు హిస్సోపు మండతో తనమీద నెతురుచిలకరించి తన్ను శుద్ధిచేయాలని కోరుకొన్నాడు - 51,7.

ప్రభువు సిలువమీద ఈ పానీయాన్ని సేవించింది కేవలం దప్పికను తీర్చుకోవడానికి మాత్రమేకాదు. ప్రవచనాలను నెరవేర్చడానికిగూడ, కీర్తనకారుడు ఈలా వ్రాసాడు.

"ఎవరైనా నన్ను కరుణించి ఓదారుస్తారేమో ననుకొన్నాను
కాని ఆలాంటివాళ్ళెవరూ నాకంటబడలేదు
వాళ్ళ నాకు చేదుని తిన్పించారు
దపికైనప్పడు నాచే పులిసినరసాన్ని త్రాగించారు" - 69, 21-22
ఈ ప్రవచనాన్నినెరవేర్చడానికే ఇక్కడ ప్రభువు ఈ పలిసిన రసాన్ని సేవించాడు.

మనజీవితంలో చావు అనేది చివరి సంఘటనంగా వస్తుంది. అది యెప్పడొస్తుందో గూడ మనకు తెలియదు. కాని క్రీస్తు జీవితంలో అలాకాదు. అతనికి తన మరణాన్ని గూర్చిన వివరాలన్నీ ముందుగానే తెలుసు. ఇంకా, మనం చేతకాక మరణానికి