పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక్కడ అతడు కేవలం నరుడుగా దేవుడికి మొరపెట్టు కొంటున్నాడనీ కొందరు భావించారు. కాని అది పొరపాటు, క్రీస్తులో దైవస్వభావమూ మానుష స్వభావమూ ఎప్పడూ కలసే వున్నాయి.

ఒకోసారి ఎత్తయిన పర్వతశిఖరాల మధ్యభాగాన్ని మబ్బులు ఆవరిస్తాయి. ఆ కొండల శిఖరాలు సూర్యప్రకాశంలో మెరుసూన్నా వాటి పాదాలు ఆ మబ్బుల నీడల వలన చీకట్లతో నిండివుంటాయి. సిలువమీద క్రీస్తుకికూడ అలాగే జరిగింది. అతనికి తండ్రి దర్శనం పూర్తిగా మరుగైపోలేదు. కాని నరుల పాపభారాన్నంతటినీ తన భుజస్కంధాలపై మోస్తూ వుండడంవల్ల కొన్ని క్షణాలపాటు ఆ తండ్రి దర్శనం స్పష్టతను కోల్పోయింది. ఆ తండ్రితో ఐక్యమై యుండడంవలన కలిగే ఆనందం మరుగైపోయిందా అన్పించింది. కనుక అతడు ఇక్కడ తండ్రినుద్దేశించి "నా దేవా నా దేవా" అని విలపించాడు. తండ్రిచే చేయి విడువబడినట్ల, తండ్రినుండి తాను వేరైపోయినట్లు, ఏకాకిఐపోయినటూ భావించాడు. తాను భరించే పాపాల ఫలితం అది.

పాపఫలితం దేవుడికి దూరమైపోవడం. ఇక్కడ క్రీస్తు అనుభవించిన బాధ యిదే, నరులు పాపంద్వారా దేవుని నుండి వైదొలగిపోయారు. క్రీస్తు ఆ పాపాన్నంతటినీతన భుజాలమీద భరించాడు. ఫలితంగా అతడు తాను స్వయంగా దేవుని నుండి వైదొలగిపోయిన ట్లనిపించింది. ఆ బాధను భరించలేక అతడు "నా దేవా నా దేవా" అని అరచాడు. ఆ රාජාණඒ* దేవుణ్ణి నిరాకరించే నాస్తికుల ఆక్రోశనాలన్నీ ఇమిడి వున్నాయి. దేవుని ప్రేమను నిరాకరించే పాపాత్ముల అంగలార్పులన్నీ ఇమిడి వున్నాయి. దేవుణ్ణి కాదనడమూ అతని ప్రేమను నిరాకరించడమూ అంటే నరకాన్ని కోరుకోవడమే కదా? కనుకనే క్రీస్తు పాపభారంతో సిలువమీద వ్రేలాడుతూ కొన్ని క్షణాలపాటు పాపఫలితమైన నరకయాతనను చవిచూచాడు, పాపాత్ములందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసూ దేవునికి దూరం కావడం అనే ఫబోరవ్యధను కొంతకాలంపాటు అనుభవించాడు. అంధకారం అతన్ని ఆవరించింది. అతడు ఒంటరిగాడయినట్లుగా భావించి దుఃఖించాడ.

నరునికి ఆదిలో దేవుడిచ్చినవరం వెలుతురు. ఈ వెలుతురు ఎంతో విలువైంది. భగవంతుడు మంచివాళ్ళకీ చెడ్డవాళ్ళకీగూడ నిత్యం ఈ వెలుతురును ప్రసాదిస్తూనే వుంటాడు - మత్త 5,45, ఐతే పాపం చీకటిలాంటిది. క్రీస్తు సిలువమీద నరజాతి పాపానికి పరిహారంచేస్తూ ఆ చీకటిని పూర్ణంగా అనుభవించాడు. లోకానికి వెలుతురునిచ్చే ప్రభువు తాను చీకటికి లొంగిపోయాడు.

సిలువ మరణాన్ని అనుభవించేవాడు శాపగ్రస్తుడు అంటుంది పూర్వవేదం - ద్వితీ 21, 23. క్రీస్తుకికూడ ఒక రీతిగా ఈ శాపం అన్వయిస్తుంది. కాని అతడు